Begin typing your search above and press return to search.

యువి కాన్సెప్ట్స్ తొలి చిత్రం టీజర్ పోస్టర్

By:  Tupaki Desk   |   5 March 2021 5:31 AM GMT
యువి కాన్సెప్ట్స్ తొలి చిత్రం టీజర్ పోస్టర్
X
ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌ యువి క్రియేషన్స్ స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ సంస్థ‌ యువ ఔత్సాహిక న‌టీనటులు.. ద‌ర్శ‌క నిర్మాతలు.. రచయితలు.. సాంకేతిక నిపుణుల్ని ప్రోత్స‌హించేందుకు స‌రైన ప్ర‌ణాళిక‌తో ముందుకు వ‌చ్చింది. క్రియేటివిటీ ఉండి అవ‌కాశాలు లేని వారికి అవ‌కాశాలు క‌ల్పించ‌డం ఈ ప్ర‌య‌త్నంలో ముఖ్య ఉద్ధేశం. గొప్ప ప్ర‌యోగాత్మ‌క‌ కాన్సెప్ట్-ఓరియెంటెడ్ సినిమాలతో ముందుకు వచ్చే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు.. సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడానికి యువి కాన్సెప్ట్స్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది.

ఈ విభాగం నుంచి తొలి టీజ‌ర్ పోస్ట‌ర్ తాజాగా రిలీజైంది. మ్యాంగ్ మాస్ మీడియా బ్యానర్ ‌తో కలిసి యువి కాన్సెప్ట్స్ తన తొలి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం టీజర్ పోస్టర్ ఈ శుక్ర‌వారం ఉదయం విడుదలైంది. మొదటి మినీ లుక్ మార్చి 7 న విడుదల కానుంది.

పోస్ట‌ర్ ఆద్యంతం క్రియేటివిటీ ఫ‌న్ ఎలిమెంట్ తో స‌స్పెన్స్ ని ఎలివేట్ చేస్తోంది. ప్రముఖ దర్శకుడు మెర్లపాకా గాంధీ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించ‌గా..డెబ్యూ కార్తీక్ రాపోలు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ హీరో సంతోష్ శోభన్- బాలీవుడ్ యువ‌నాయిక‌ కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ లక్కరాజు సంగీతం అందించ‌నున్నారు. ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.