సూరి ఇంకా ఏడాది వెయిట్ చేయాల్సిందేనా?

Sun Aug 02 2020 13:00:48 GMT+0530 (IST)

Does Suri still have to wait a year?

గత ఏడాది ‘సైరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటి వరకు తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. పలువురు హీరోలతో ఈయన చర్చలు జరిపాడనే వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్.. అల్లు అర్జున్ ఇంకా కొందరు హీరోలతో కూడా ఈయన సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఏవో కారణాల వల్ల మెగా హీరోలతో ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కిక్ ఇచ్చిన హీరో రవితేజతో ఈయన సినిమాకు రెడీ అవుతున్నాడనే కొత్త ప్రచారం మొదలైంది.ప్రముఖ రచయితతో కలిసి ఇప్పటికే రవితేజ కోసం స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఆ స్క్రిప్ట్ కు రవితేజ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు పూర్తి చేసిన తర్వాత సూరితో సినిమాను చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ప్రస్తుతం రవితేజ కమిట్ అయ్యి ఉన్న సినిమాలు పూర్తి అయ్యేందుకు ఇంకా ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని అప్పటి వరకు సూరి వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకు రవితేజ డేట్స్ కోసం సురేందర్ రెడ్డి వెయిట్ చేయక తప్పదేమో అంటున్నారు.

ధృవ మరియు సైరా చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకున్న సురేందర్ రెడ్డి కొత్త సినిమాకు ఇంత ఆలస్యం అవ్వడం కాస్త విడ్డూరంగానే ఉంది. ఈమద్య కాలంలో స్టార్ దర్శకులు సినిమా సినిమాకు మద్య చాలా గ్యాప్ ఇవ్వకుండానే వస్తుంది. హీరోల వల్ల ఇతరత్ర కారణాల వల్ల దర్శకులు కొత్త సినిమాలకు సమయం పడుతుంది. ఇప్పుడు రవితేజతో సినిమా చేయాలనుకున్న సురేందర్ రెడ్డి కూడా ఇంకా ఏడాది కాలం పాటు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు.