Begin typing your search above and press return to search.

#ఆర్య‌3 .. సుకుమార్ అలాంటి త‌ప్పు చేస్తాడా?

By:  Tupaki Desk   |   18 Oct 2021 11:30 PM GMT
#ఆర్య‌3 .. సుకుమార్ అలాంటి త‌ప్పు చేస్తాడా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ తెర‌కెక్కించిన ఆర్య ఎంత పెద్ద హిట్ట‌య్యిందో తెలిసిందే. బ‌న్నీని హీరోగా నిల‌బెట్టిన చిత్ర‌మిది. ఈ ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు వ‌చ్చాయి. ఆ రెండిటిలో అల్లు అర్జున్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. బ‌న్ని త‌న‌కంటూ ఓ యూనిక్ స్టైల్ ఉంద‌ని నిరూపించింది ఈ సినిమాలతోనే.

ఆ త‌ర్వాత ఈ ఫ్రాంఛైజీని సుకుమార్ కొన‌సాగించ‌క‌పోవ‌డంపై అభిమానులు సందిగ్ధంలోనే ఉన్నారు. కానీ ఎట్ట‌కేల‌కు ఆర్య 3 ని తెర‌కెక్కించే ప‌నిని వేగ‌వంతం చేస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే పార్ట్ 3లో బ‌న్ని కాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచ‌న తెర‌పైకొచ్చింద‌ట‌.

దేవ‌ర‌కొండ‌కు యువ‌త‌రంలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. అందువ‌ల్ల ఆర్య-3 కి అత‌డు న్యాయం చేస్తాడ‌నే సుకుమార్ భావిస్తున్నార‌ట‌. చాలా కాలానికి నిశ్శబ్దాన్ని విరమించుకున్న సుకుమార్ ఆర్య 3 ని దేవ‌ర‌కొండ‌తో చేయడం ద్వారా తాను హిట్ ఫ్రాంచైజీని కొనసాగిస్తానని వెల్లడించడంతో ప్ర‌స్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాని ఫాల్కన్ క్రియేషన్స్ స‌హ‌కారంతో చాలా కాలం క్రితం సుకుమార్ ప్రకటించాడు. ఇప్పుడు అధికారికంగా అత‌డు మ‌రోసారి ప్ర‌క‌ట‌న చేయాల్స ఉంటుంది. అయితే ఆర్య ఫ్రాంఛైజీలో బ‌న్నీని విజ‌య్ తో రీప్లేస్ చేస్తే అత‌డి అభిమానులు అంగీక‌రిస్తారా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజ‌య్ యూనిక్ స్టైల్ తో ఆక‌ట్టుకుంటున్నా బ‌న్నీ ఫ్యాన్స్ కి ఇది నిరాశ‌ను క‌లిగించేది అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రోవైపు అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా ఆవిష్క‌రించడ‌మే ధ్యేయంగా సుకుమార్ పుష్ప ఫ్రాంఛైజీని తెర‌కెక్కిస్తున్నారు. పుష్ప-1 చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. కేవలం మూడు పాటలు మాత్రమే తెర‌కెక్కాల్సి ఉంద‌ని తెలిసింది. మరొక వైపు దేవరకొండ తన మొదటి పాన్-ఇండియా వెంచర్ `లైగర్‌`తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ప్రాజెక్టులు పూర్త‌యితే సుకుమార్ - దేవ‌ర‌కొండ మూవీపై అధికారిక ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఆర్య‌2 విడుద‌లైన ప‌దేళ్ల‌కు పార్ట్ 3 ప్లానింగ్

అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ అన్న పేరు ఎలా వ‌చ్చింది? అంటే అందుకు కార‌ణం `ఆర్య` సిరీస్ అన‌డంలో సందేహం లేదు. బ‌న్నీని అత్యంత స్టైలిష్ గా ఎలివేట్ చేసిన డైరెక్ట‌ర్ గా సుకుమార్ కి పేరొచ్చింది. నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్లు అర్జున్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నారంటే సుక్కూ క్రియేట్ చేసిన ఆర్య పాత్ర వ‌ల్ల‌నే. పూరి- దేశ‌ముదురు ప‌క్కా మాస్ అండ్ స్టైలిష్ హీరోగా ఎలివేట్ చేస్తే ఆ స్థాయిని ఆర్య 2 మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది.

అందుకే ఆర్య - ఆర్య 2 చిత్రాల్ని బ‌న్ని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. ఆర్య 2 రిలీజై ఇప్ప‌టికే ప‌ది సంవ‌త్స‌రాలైంది. ఇప్ప‌టికీ ఈ మూవీ గురించి అభిమానులు గొప్ప‌గానే చెప్పుకుంటున్నారంటే అది సుక్కూ ప‌నిత‌నం అనే చెప్పాలి. అలాంటి గొప్ప అవ‌కాశం ఇచ్చిన సుకుమార్ కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు బ‌న్ని. ఆర్య 2 క‌మర్షియ‌ల్ స‌క్సెస్ అవ్వ‌క‌పోయినా బ‌న్ని న‌టించిన స్టైలిష్ సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ఇచ్చిన చార్ట్ బ‌స్ట‌ర్ ట్యూన్స్ ఇప్ప‌టికీ మ‌రువ‌లేరు యూత్. ఉప్పెనంత ఈ ప్రేమ‌కి.. గుప్పెడంత గుండె ఏమిటో.. పాట ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయ్యింది. ఇన్నేళ్ల‌యినా ఆర్య ఫ్రాంఛైజీ సినిమాల‌తో బ‌న్ని ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట‌య్యి ఉన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు.