ఆర్య లో ఇలాంటి ప్యాషన్ కూడా ఉందా..!

Mon Aug 15 2022 18:00:01 GMT+0530 (IST)

Does Arya have similar passion..!

ఒకప్పుడు హీరోలు అంటే కేవలం నటించడం వరకు అన్నట్లుగా ఉండేవారు. కాని ఇప్పుడు హీరోలు మల్టీ టాలెంటెడ్ అంటూ పలు సందర్భాల్లో నిరూపించుకుంటూనే ఉన్నారు. చాలా మంది హీరోలు కేవలం నటనలో మాత్రమే కాకుండా ఇతర రంగాల్లో కూడా ప్రావీణ్యం ను కనబర్చుతూ ఉన్నారు. తమిళ హీరో అజిత్ కి బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం.. వేల కిలో మీటర్లు ఆయన బైక్ రైడ్ చేస్తూ ఉంటారు.ఇంకా కొందరు హీరోలకు కొన్ని రకాల ప్యాషన్స్ ఉంటాయి. తమిళ హీరో ఆర్య తాజాగా సోషల్ మీడియా ద్వారా అందరిని ఆశ్చర్యపర్చాడు. తాజాగా ఆయన 1540 కిలో మీటర్లు సైక్లింగ్ ను పూర్తి చేశాడట. లండన్ లో తన టీమ్ తో కలిసి ఈ భారీ సైక్లింగ్ యాత్రను ముగించినట్లుగా చాలా సంతోషంగా ఆర్య సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

ఒక ఛాలెంజింగ్ ట్రిప్ ను పూర్తి చేసినందుకు గర్వంగా ఉంది. ఈ ఛాలెంజ్ లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్య కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆర్య మరో ఛాలెంజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని.. త్వరలోనే మళ్లీ సైక్లింగ్ ట్రిప్ ఉంటుంది అన్నట్లుగా చెప్పకనే చెప్పాడు.

ఆర్య లో ఉన్న ఈ ప్యాషన్ కు ఆయన అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. నిజంగా హీరో ఆర్య అన్ని కిలో మీటర్ల సైక్లింగ్ చేశాడు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఫిజికల్ ఫిట్ నెస్ పై ఎంత శ్రద్ధ పెడతారో మరోసారి దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు చర్చించుకుంటున్నారు.

తమిళంలో హీరోగా నటిస్తూనే వరుసగా తెలుగు లో మరియు ఇతర భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా కూడా ఆర్య నటించడం జరుగుతుంది. ఆర్య లో విలన్ తో పాటు హీరో ఉన్నాడు. అలాగే ఇలా ఒక ఛాంపియన్ కూడా ఉన్నాడని దీంతో వెళ్లడయ్యింది.