షాకింగ్ః అందంగా మారుస్తానని చెప్పి.. హీరోయిన్ ముఖం పాడు చేసింది!

Sun Apr 18 2021 21:40:33 GMT+0530 (IST)

Doctor Has damaged Heroine face

నల్లగా ఉన్నవారిని తెల్లగా చేస్తామని.. తెల్లగా ఉన్నవారిని మిల్కీ బ్యూటీస్ గా మారుస్తామంటూ మార్కెట్లోకి వచ్చే ఊరూపేరూ లేని ఉత్పత్తులకు కొదవేలేదు. అయితే.. కొందరు బ్యూటీషియన్లు వైద్యులు కూడా.. నేరుగా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ముఖారవిందాలను నాశనం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక హీరోయిన్ కు ఎదురుకావడం గమనార్హం.కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి రైజా విల్ సన్.. 2017లో ‘వెలయ్యలా పట్టధారి-2’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్లో పాల్గొంది. 2018లో ‘ప్యార్ ప్రేమ కాదల్’తో సత్తాచాటింది. ప్రస్తుతం ‘అలైస్’ ‘హ్యాష్ ట్యాగ్ లవ్’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.

అయితే.. రెగ్యులర్ ఫేషియల్ కోసం ఓ క్లినిక్ కు వెళ్లింది రైజా. అయితే.. అక్కడి మహిళా డాక్టర్ నిన్ను ఎంత అందంగా మారుస్తానో చూడమంటూ.. స్కిన్ ట్రీట్మెంట్ ఏదో చేసిందట. వద్దని చెప్పినా వినకుండా.. బాగుంటుందని ఒప్పించి మరీ ప్రయోగం చేసిందట. కానీ.. అది వికటించడంతో ఆ హీరోయిన్ ఫేస్ గుర్తు పట్టలేనంతగా మారిపోవడం గమనార్హం.

ఫేస్ మారిపోవడంతోపాటు కన్ను కింద నల్లగా గడ్డలాగా వాచిపోయింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన నటి.. సదరు డాక్టర్ కలవడానికి వెళ్తే అవకాశం ఇవ్వట్లేదట. ఈ మేరకు రైజా విల్ సన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘‘నాకు అవసరం లేకపోయినా డాక్టర్ బైరవి ఏదో ట్రై చేసింది. చివరకు ఫలితంగా ఇదిగో ఇలా వచ్చింది. దీని గురించి అడుగుదామంటే కలవట్లేదు. సిబ్బందిని నిలదీస్తే.. ఆమె నగరంలో లేదని జవాబు చెబుతున్నారు.’’ అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే.. రైజా విల్ సన్ మాత్రమే కాకుండా.. ఆ డాక్టర్ బాధితులు చాలా మంది ఉన్నారని తెలుస్తోంది.