టాలీవుడ్ జోడీని బీటౌన్ లో అసలు పట్టించుకోవడం లేదా..?

Sun Jun 13 2021 10:00:02 GMT+0530 (IST)

Do you really care about the Tollywood couple

టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టారు. క్రేజ్ తో సంబంధం లేకుండా ఉత్తరాది ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ స్టార్ స్టేటస్ అందుకున్న పలువురు హీరోయిన్లు కూడా ఫైనల్ డెస్టినేషన్ బాలీవుడ్ ఇండస్ట్రీయే అన్నట్లు బాంబేకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ జంట హిందీ పరిశ్రమలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.తెలుగులో రెండు చిత్రాల్లో హీరోహీరోయిన్లుగా నటించిన ఈ జోడీ.. టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించిన ఈ జంట.. రియల్ లైఫ్ లో కూడా రిలేషన్ షిప్ లో ఉన్నారని అప్పట్లో ఓ రేంజ్ లో పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఇవేవీ పట్టించుకోని ఈ క్రేజీ పెయిర్.. ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో సదరు హీరోయిన్ హిందీ సినిమాల్లో ఛాన్స్ కూడా కొట్టేసింది.

సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న వీరిద్దరూ.. నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అయితే హిందీలో వీళ్ళు ఫుల్ గా ఫేమస్ అవుతున్నారని సౌత్ లో గోల తప్పితే.. ఈ పెయిర్ కి అక్కడ కనీసం అటెన్షన్ కూడా ఇవ్వడం లేదని బీ టౌన్ వర్గాలు చెబుతున్నారు. బాలీవుడ్ లో కొన్ని పేజ్-3 సెక్టార్ వాళ్లు తప్పితే మిగతా వాళ్ళెవరూ ఈ టాలీవుడ్ జోడీని అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరి ప్రస్తుతం వీరిద్దరూ నటిస్తున్న సినిమాలు విడుదలైన తర్వాత హిందీలో క్రేజ్ తెచ్చుకుంటారేమో చూడాలి.