బన్నిపై చరణ్ కి ఎంత ప్రేమో తెలుసా?

Sun May 09 2021 16:00:01 GMT+0530 (IST)

Do you know how much love Charan has for Bunny

పుష్ప చిత్రీకరణ సమయంలో అల్లు అర్జున్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. కోవిడ్ పాజిటివ్ రాగానే గృహనిర్భంధంలోకి వెళ్లాడు. బన్నికి తేలికపాటి లక్షణాలు కనిపించాయి. చికిత్సతో వేగంగా కోలుకుంటున్నాడు. ఇటీవలే తన ఇంటి టెర్రాస్ పై నుంచి బన్ని అభిమానులనుద్ధేశించి చేతులు ఊపుతూ కనిపించాడు. తాను ఆరోగ్యంగా ఉన్నానని సిగ్నల్ ఇచ్చాడు.తాజాగా అల్లు అర్జున్ కోలుకున్నారని తెలియగానే.. రామ్ చరణ్ తనకు హంపర్ .. హృదయపూర్వక నోట్ ని పంపారు. ``నీవు బాగా కోలుకున్నావని ఆశిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు కలుద్దాం. బోలెడంత ప్రేమతో`` అంటూ రామ్ చరణ్ తన ప్రేమాభిమానాన్ని వ్యక్తపరిచారు.

అల్లు అర్జున్ స్వయంగా చరణ్ పంపిన హాంపర్ స్నాప్ ను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసి ``చాలా ధన్యవాదాలు! స్వీట్ గెస్చర్`` అంటూ బన్ని రిప్లయ్ ఇచ్చారు. ఆ ఇద్దరి మధ్యా సోదర ప్రేమ అభిమానుల్లో ఉల్లాసం పెంచుతోంది.