Begin typing your search above and press return to search.

అలాంటి సినిమాలతో మిగతా ఓటీటీలకు పోటీ ఇచ్చేనా..?

By:  Tupaki Desk   |   18 Jun 2020 9:10 AM GMT
అలాంటి సినిమాలతో మిగతా ఓటీటీలకు పోటీ ఇచ్చేనా..?
X
నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ - హాట్ స్టార్ - సన్ నెక్స్ట్ - ఎమెక్స్ ప్లేయర్ - జీ 5 లాంటి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా చూపిస్తున్న టైంలో 100 శాతం తెలుగు స్ట్రీమింగ్ యాప్ అంటూ వచ్చింది “ఆహా”. టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొంతమంది ప్రముఖులతో కలిసి 'ఆహా'తో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టాడు. సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ యాప్ ప్రారంభంలో మంచి ఆదరణను రాబట్టుకుని ఆహా అనిపించుకుంది. అయితే రాను రాను మిగతా ఓటీటీలతో పోటీ పడలేకపోయిందనే కామెంట్స్ వినిపించాయి. అంతేకాకుండా 'ఆహా'లో వస్తున్న సినిమాలు వెబ్ సిరీస్ లు అంతలా ప్రభావాన్ని చూపలేకపోయాయని.. అందుకే మిగతా ఓటీటీలతో పోటీ పడలేకపోతోందని కామెంట్స్ వస్తున్నాయి. ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ ఓల్డ్ మూవీస్ అవడం.. వెబ్ సిరీసెస్ కంటెంట్ కూడా నెట్ ప్లిక్స్ ప్రైమ్ రేంజ్ లో లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. దీంతో తమ సినిమాలను ఓటీటీ రిలీజ్ చేయాలని అనుకుంటున్న నిర్మాతలు 'ఆహా' వైపు మాత్రం చూడటం లేదనే టాక్ వచ్చింది.

కాగా లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అయి టీవీలలో ఫ్రెష్ కంటెంట్ లే జనాలు అందరూ ఎంటెర్టైన్మెంట్ కోసం ఓటీటీలను ఆశ్రయించారు. దీంతో అన్ని ఓటీటీలు విశేష ఆదరణతో దూసుకుపోతున్నాయి. అయితే అట్రాక్ట్ చేసే కంటెంట్ లేని కారణంగా 'ఆహా'కు మాత్రం పెద్దగా ఆదరణ దక్కలేదని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. పిల్లలని అట్రాక్ట్ చేయొచ్చని రిలీజ్ చేసిన కార్టూన్ మూవీస్ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయాయట. ఈనేపథ్యంలో నాలుగు చిన్న సినిమాల రైట్స్ కొనుగోలు చేసి 'ఆహా'లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. వాటిలో నవీన్ చంద్ర - సలోని లుథ్రా హీరో హీరోయిన్లుగా నటించిన 'భానుమతి రామకృష్ణ' సినిమాని జూలై 3న రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు ప్రభుదేవా ప్రధాన పాత్రలో వచ్చిన 'లక్ష్మి' సినిమాని జూన్ 19న ఓటీటీలో రాబోతోంది. ఇప్పటికే థియేటర్ రిలీజైన ఈ సినిమా మొదటిసారి డిజిటల్ లో విడుదలవుతోంది.

అంతేకాకుండా ఈ రెండు సినిమాలతో పాటు జీవా హీరోగా నటించిన తమిళ్ మూవీ 'జిప్సీ మరియు మమ్ముట్టి నటించిన 'షైలాక్' అనే మలయాళ సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ కూడా తీసుకున్నారట. ఈ రెండు సినిమాల రిలీజ్ తేదీలు ప్రకటించనప్పటికీ త్వరలోనే 'ఆహా'లో రాబోతున్నాయని సమాచారం. అయితే ఇలాంటి సినిమాలతో 'ఆహా'కు ఎంతవరకు క్రేజ్ తీసుకురాగలరని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. 'జిప్సీ' మరియు 'షైలాక్' సినిమాలు ప్లాప్ అయిన సినిమాలు. అలానే మిగతా రెండు సినిమాల మీద కూడా హైప్ లేదనే చెప్పుకోవాలి. ఒకవైపు మిగతా ఓటీటీలలో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ చేస్తుంటే 'ఆహా'లో మాత్రం వాటికి దీటుగా సినిమాలు రావడం లేదని అంటున్నారు. మరి ఈ సినిమాలతోనైనా 'ఆహా' పుంజుకొని మిగతా ఓటీటీలకు పోటీగా ఆహా అనిపించుకుంటుందేమో చూడాలి.