మరో పరభాష హీరో టాలీవుడ్ ఎంట్రీ

Fri Sep 24 2021 05:00:02 GMT+0530 (IST)

Dixit Shetty wants to make more films in Telugu

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా ఇతర భాషల నటీ నటులు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ మరియు ధనుష్ లు ఇప్పటికే తెలుగు సినిమాలకు కమిట్ అయ్యారు. మరో ఇద్దరు తమిళ హీరోలు కూడా తెలుగు లో నటించేందుకు ఓకే చెప్పారని సమాచారం అందుతోంది. ఈ సమయంలోనే మరో భాష హీరో కూడా తెలుగు లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ యంగ్ హీరోను నాని ఇంపోట్ చేస్తున్నాడట. నాని నిర్మాణంలో ఆయన సోదరి దర్శకత్వంలో రూపొందుతున్న మీట్ క్యూట్ సినిమా తో కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టిని తెలుగు లో పరిచయం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.దియా సినిమా తో నటుడిగా మంచి పేరును దక్కించుకున్న ఈయన తెలుగు లో ఇప్పటికే ముగ్గురు మొనగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాని ఆ సినిమా తో దీక్షిత్ కు తెలుగులో అంతగా గుర్తింపు అయితే దక్కలేదు. స్టార్ హీరో అయిన నాని నిర్మిస్తున్న సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా మంచి క్రేజ్ ఉంటుందనే నమ్మకం ఉంది. అందుకే మీట్ క్యూట్ సినిమాలో దీక్షిత్ నటించడం వల్ల ఖచ్చితంగా ప్రేక్షకుల్లో నోటెడ్ అవుతాడని అంటున్నారు. మీట్ క్యూట్ లో చాలా కీలక పాత్రలో ఈయన కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమా అయిన మీట్ క్యూట్ లో దీక్షిత్ నటించే విషయం అధికారికంగా వెళ్లడి కాలేదు. కాని ఖచ్చితంగా వీరి కాంబో ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

దీక్షిత్ శెట్టి తెలుగు లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే తెలుగు సినిమాల పరిధి ఎక్కవు.. ఇతర భాషల్లో కూడా మంచి ఆధరణ దక్కించుకుంటాయి. పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకోవాలి అంటే తెలుగు సినిమాల్లో నటించాలనే ఒక అభిప్రాయం ఏర్పడింది. అందుకే తెలుగు లో నటించేందుకు యంగ్ స్టార్స్ పలువురు కోరుకుంటున్నారు. దీక్షిత్ ఈ సినిమాతో మరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఈ ఏంట్రీతో ఖచ్చితంగా దీక్షిత్ కు గుర్తింపు దక్కుతుందా అనేది చూడాలి. తెలుగు లో ఎంతో మంది హీరోలు ముందు ముందు కూడా పరాయి భాష నుండి వచ్చి సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.