ఐష్ తో విడాకులా? అభిషేక్ తాజా మాటల్ని విన్నారా?

Tue Oct 04 2022 11:00:02 GMT+0530 (India Standard Time)

Divorce with Aish? Have you heard Abhishek's latest words?

బాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. అంతేలా విడిపోవటం కామన్. దీనికి భిన్నంగా ప్రపంచ సుందరిగా టైటిల్ గెలుచుకొని.. సినిమాల్లోకి వచ్చి కోట్లాది మంది మనసుల్ని దోచుకున్న ఐశ్వర్యారాయ్ అలియాస్ ఐష్ వైవాహిక జీవితం మాత్రం మిగిలిన వారికి పూర్తి భిన్నమని చెబుతారు.అభిషేక్ బచ్చన్ తో వివాహమై దాదాపు పద్దెనిమిదేళ్లు అవుతున్న సంగతి తెలిసిందే. 2014లో వారి వివాహం అయ్యాక.. వారిద్దరూ విడిపోతున్నట్లుగా అప్పుడప్పుడు ప్రచారం జరగటం.. వారిద్దరు మాత్రం కలిసే ఉండటం తెలిసిందే.

అభిషేక్ - ఐష్ లు విడిపోతున్నారన్న ప్రచారం మరోసారి మొదలైంది. ఈ ప్రచారం నేపథ్యంలో అభిషేక్ రియాక్టు అయ్యారు. కాసింత ఎటకారంతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. 'నేను విడాకులు తీసుకుంటానని నమ్ముతున్నా. దీన్ని గుర్తు చేసినందుకు థ్యాంక్స్. మరి.. నా రెండో పెళ్లి ఎప్పుడో కూడా చెప్పండి' అంటూ తప్పుడు ప్రచారం చేసే వారిని మెత్తగా ఏసుకున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలోనూ ఈ జంట విడిపోతున్నట్లుగా.. అత్త జయాబచ్చన్ తో ఉన్న విభేదాలు.. ఆమె పెట్టే ఆంక్షలకు తట్టుకోలేని ఐష్.. బయటకు రావాలని భావిస్తున్నట్లుగా పేర్కొంటూ చాలానే ప్రచారాలు సాగాయి. కానీ.. అవేమీ నిజాలుగా తేల్లేదు.

ఐశ్వర్యతో తన జీవితాన్ని ఎలా నడిపించాలో చెప్పేందుకు మూడో వ్యక్తిని తాను అంగీకరించనన్న అభిషేక్.. ఆమెను తానెంతగా ప్రేమించేది ఐష్ కు తెలుసని.. అదే సమయంలో ఆమె తనను ఎంతలా ప్రేమిస్తుందో తనకు తెలుసంటూ చెప్పుకొచ్చారు.

ఏమైనా.. ఈ ఇద్దరు విడిపోతున్నారంటూ మళ్లీ మొదలైన ప్రచారం త్వరలోనే ముగుస్తుందని ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.