విడాకులు తీసుకున్నా.. ఈ బంధం కు అంతం లేదు

Sun Jan 23 2022 11:50:16 GMT+0530 (IST)

Divorce does not end this bond

బాలీవుడ్ స్టార్స్ ఈమద్య కాలంలో వరుసగా విడాకులు తీసుకుంటున్న విషయం తెల్సిందే. కేవలం బాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా ఇతర ఇండస్ట్రీలకు చెందిన వారు మరియు ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ వారు కూడా విడాకులు తీసుకుంటూ రోజు ఏదో ఒక విడాకుల వార్త వస్తూనే ఉంది. బాలీవుడ్ లో ఒకప్పుడు మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటూ పేరు దక్కించుకున్న హృతిక్ రోషన్ మరియు సుసానే ఖాన్ లు కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరు విడాకులు తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే వారు ఇద్దరు కూడా అంతటి అన్యోన్యంగా ఉండేవారు. ఎందుకు ఇలా జరిగింది అంటూ ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెట్టారు. విడాకులు తీసుకున్నట్లుగా ఇద్దరు ప్రకటించారు.. అయితే పిల్లల కోసం వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

రెగ్యులర్ గా ఇద్దరు కలవడం జరుగుతూనే ఉంది. లవర్స్ మాదిరిగా ఇద్దరు కూడా మళ్లీ కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్ మీడియా వీరిద్దరు మళ్లీ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా ప్రచారం చేస్తున్నాయి. ఆ వార్తలపై పెద్దగా ఇద్దరు కూడా స్పందించలేదు. కాని ఇద్దరు కూడా సహజీవనం సాగిస్తున్నారేమో అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా హృతిక్ రోషన్ సోదరి అయిన సునైనా రోషన్ పుట్టిన రోజు వేడుకలో సుసానే పాల్గొంది. ఆ సమయంలో తీసుకున్న సెల్ఫీ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా సుసానే మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

హృతిక్ రోషన్ తో ఉన్న ఫొటోలను సుసానే షేర్ చేస్తూ కొన్ని బందాలకు అంతం ఉండదు అన్నట్లుగా కామెంట్ పెట్టింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన హృతిక్ రోషన్ తో మరియు అతడి సోదరి సునైనా రోషన్ తో బంధం కట్ అవ్వలేదు అన్నట్లుగా ఆమె అభిప్రాయం అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె ఉద్దేశ్యంతో మళ్లీ వారిద్దరు కలుస్తారని క్లారిటీ వచ్చిందని అంటున్నారు.

 మొత్తానికి బాలీవుడ్ లో ఆమె ఇన్ స్టా స్టోరీ చర్చకు తెర తీసింది. ఖచ్చితంగా వారిద్దరు కలిసి ముందు ముందు ఇదే విధంగా ఆనందంగా ముందుకు సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.