Begin typing your search above and press return to search.

క‌ళ్ల‌తోనే కుర్రాళ్ల గుండె కోసేస్తున్న బిగ్ బాస్ దివి

By:  Tupaki Desk   |   24 July 2021 7:03 AM GMT
క‌ళ్ల‌తోనే కుర్రాళ్ల గుండె కోసేస్తున్న బిగ్ బాస్ దివి
X
అందానికి అందం ప్ర‌తిభ మెండుగా ఉంటే టాలీవుడ్ నుంచి ఆశీస్సులు ద‌క్కుతాయ‌న‌డంలో సందేహ‌మేం లేదు. సినీరంగంలో చాలామంది తెలుగ‌మ్మాయిలు తారాప‌థంలోకి దూసుకెళుతున్నారు. కెరీర్ ని మ‌రో లెవ‌ల్ కి విస్త‌రించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక‌సారి క్లిక్క‌యితే ఆదాయ ఆర్జ‌న‌కు ఇక్క‌డ కొద‌వేమీ లేదు. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 4లో సందడి చేసిన హైద‌రాబాదీ మోడ‌ల్ దివి వ‌ద్య‌త ప్ర‌స్తుతం క్రేజీగా అవ‌కాశాల‌ను అందుకుంటూ స‌త్తా చాటుతున్నారు. ఇటీవ‌ల టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2020 జాబితాలో దివి అగ్ర ప‌థాన నిలిచి మ‌రోసారి అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకుంది. దివి అంద‌చందాలు వైర‌ల్ ప్ర‌మోష‌న్ యువ‌త‌రానికి న‌చ్చేయ‌డంతో మోస్ట్ డిజైర‌బుల్ జాబితాలో చేర్చేశారు.

దివి వ‌ద్య‌త‌ పేరు ఇటీవ‌ల టాలీవుడ్ లో ఓ రేంజులోనే మార్మోగుతోంది. తెలుగులో ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు దివి పేరును ప‌రిశీలిస్తున్నార‌ని సమాచారం. ఇక ఇన్ స్టా మాధ్య‌మంగానూ ఈ బ్యూటీ హాట్ కంటెంట్ పై ముచ్చ‌టించ‌ని కుర్రాళ్లు లేనే లేదు. అంతగా పాపులారిటీ తెచ్చుకునేందుకు నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో ఇన్ స్టా వేదిక‌పై ద‌ర్శ‌న‌మిస్తోంది. మ‌రోవైపు న‌టిగా ప్ర‌తిభ‌ను చూపించేందుకు త‌పిస్తోంది.

దివి న‌టించిన క్యాబ్ `స్టోరీస్ వెబ్` వెబ్ సిరీస్ యూత్ లో బాగానే క్లిక్క‌య్యింది. దివి అంద‌చందాలు న‌ట‌న మ‌త్తెక్కించాయి. మునుముందు ఈ బ్యూటీకి మెగా కాంపౌండ్ అక్కినేని కాంపౌండ్ నుంచి మంచి అవ‌కాశాలు ద‌క్క‌నున్నాయ‌ని స‌మాచారం.

మ‌రోవైపు దివి వ‌ద్య‌త లేటెస్ట్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది. దివి ట్రెడిష‌న‌ల్ లుక్ లో ఎంతో ప్లెజెంట్ గా క‌నిపిస్తోంది. వైట్ అండ్ లైట్ ఎల్లో మిక్స్ డ్ క‌ల‌ర్ తో ప‌రికిణీ డిజైన‌ర్ బ్లౌజ్ ధ‌రించిన దివి మెడ‌లో ముత్యాల‌హారం ధ‌రించింది. ఇక ఆ కాలికి వెండి ప‌ట్టీలు చేతుల‌కు బంగారు గాజులు ఎంతో అందాన్ని తెచ్చాయి. క్రీగంటి చూపుతో కుర్రాళ్ల గుండె కోసేస్తోంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.