బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ ల పెళ్లికి సర్వం సిద్దం అయ్యింది. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ లోని ఒక స్టార్ హోటల్ లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరుగబోతుంది. ఇండస్ట్రీలో అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం ఇవ్వడం జరిగింది. పలువురు వీరి పెళ్లికి హాజరు అవ్వాలనుకున్నా కూడా కనీసం వారికి ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని స్వయంగా వారే అంటున్నారు. పెళ్లి కార్డు మాకు వస్తుందని ఆశించాం. కాని ఇప్పటి వరకు మా వద్దకు ఆ పెళ్లి ఆహ్వాన పత్రిక రాలేదు అంటూ చెబుతున్నారు. కరోనా థర్డ్ వేవ్ ఆందోళన నేపథ్యంలో పెళ్లికి ఎక్కువ మంది గెస్ట్ లను ఆహ్వానించడం లేదని సమాచారం అందుతోంది.
పెళ్లి జరుగుతున్న వేదిక వద్ద
పరిస్థితులను సదరు జిల్లా కలెక్టర్ పర్యవేశించాడని తెలుస్తోంది. కరోనా
కేసులు మళ్లీ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అందుకు సంబంధించిన
జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పెళ్లి నిర్వాహకులను ఆదేశించాడు. ఆయన ఈ
పెళ్లి గురించి మాట్లాడుతూ 200 మంది లోపు బంధు మిత్రులు ఈ పెళ్లికి
వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్
రెండు డోసులు వేయించుకున్న వారు అయ్యి ఉండాలి. ఒక వేళ వ్యాక్సిన్ డోసు
తీసుకోని వారు అయితే ఖచ్చితంగా పెళ్లికి హాజరు అయ్యే ముందు కరోనా నెగటివ్
టెస్టు రిపోర్ట్ ఇవ్వాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసినట్లుగా కలెక్టర్
పేర్కొన్నారు.
ఈ సమయంలో వేడుకలు మరియు పండుగలు.. పెళ్లిళ్లు ఇలా
ప్రతి తంతును కూడా ఆంక్షల మద్య నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అందుకే
కత్రీనా మరియు విక్కీ కౌశల్ ల పెళ్లికి కూడా ఆంక్షలు విధించినట్లుగా
కలెక్టర్ పేర్కొన్నాడు. ఆంక్షలు ఉల్లంఘించి ఎక్కువ మంది పెళ్లికి హాజరు
అయినా లేదంటే పెళ్లిలో కరోనా జాగ్రత్తలు నిబంధనలు పాటించకున్నా కూడా
సీరియస్ గా పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నేటి నుండి పెళ్లి వేడుకలు
ప్రారంభం అయినట్లుగా బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. వారం రోజుల పాటు
పెళ్లి సందడి కొనసాగుతుందని కత్రీనా సన్నిహితులు చెబుతున్నారు.