ప్రింటెడ్ స్కేటర్ లో దిశ పటానీ దుమారం!

Tue Sep 14 2021 06:00:02 GMT+0530 (IST)

Disha patani Latest Photo

`లోఫర్` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన దిశా పటానీ కి ఇక్కడ అసాధారణ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.  టాలీవుడ్ లో నటించింది ఈ ఒక్క చిత్రమే కానీ యూత్ లో ఫాలోయింగ్ ఏర్పడింది. కెల్విన్ క్లెయిన్ ప్రమోటర్ గా తనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ ఆ తర్వాత నటించేందుకు ఎందుకనో ఆసక్తిని చూపలేదు. బాలీవుడ్ లోనే కెరీర్ పరంగా దిశా స్థిరపడింది. అక్కడ కెరీర్ బాగానే సాగుతోంది. అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.కండల హీరో సల్మాన్ సరసన భారత్ - రాధే చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. కానీ ఇవి రెండూ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. అయినా దిశా స్పీడ్ కి ఎదురే లేదు. ప్రస్తుతం `ఏక్ విలన్ రిటర్న్స్`..`టీనా` చిత్రాల్లో నటిస్తోంది. ప్రోఫెషనల్ గా అమ్మడి కెరీర్ అలా సంతోషంగానే సాగిపోతుంది. ఇక బాలీవుడ్ లో దిశ స్నేహితుల జాబితా కూడా చాలా పెద్దదే. అగ్ర హీరోయిన్లందరితోనూ మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తుంది. అమ్మడు మంచి డాన్సర్ ఫిట్నెస్ ఫ్రీక్ ఎంథుయాస్ట్ కావడంతో బాలీవుడ్ లో కలిసొచ్చింది.

ట్యాలెంట్ తోనూ అవకాశాలు వరిస్తున్నాయి. నోరా ఫతేహీ లాంటి వాళ్లు దిశా పటానీని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో  ఇద్దరూ డాన్సింగ్ లో గురు శిష్యుల్లా మెలుగుతారు. అలాగే ఇన్ స్టాలోనూ అప్పుడప్పుడు  ఇద్దరు హాట్ ఫోటోలతోనూ దుమారం రేపుతుంటారు. తాజాగా దిశ పటానీ వర్షం చిరుకుల్లో తడితడి అందాలతో ఉన్నఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అందులో దిశ ప్రింటెడ్ స్కేటర్ దుస్తుల్ని ధరించింది. స్లీవ్ లెస్ స్కేటర్ డ్రెస్ స్వ్కేర్ ఆకారపు నెక్ లైన్ తో ఆకట్టుకుంటుంది. అదే డ్రెస్ లో ఎద ఎత్తుల ప్రదర్శన హీట్ఎక్కిస్తోంది. మెడలో క్రీస్తు లాకెట్.. బంగారం చెవిపోగులు..బ్రాస్ లెట్ ధరించింది. ముఖానికి  నల్లటి మాస్క్ తో ప్రోటోకాల్ పాటించింది.

సాధారణంగా కలర్ లెస్ ప్రింటెడ్ స్కేటర్  దిశ కు పర్ పెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. గతంలో ఇలాంటి డ్రెస్ లో ఉన్న చాలా ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈసారి ఎరుపు వర్ణం  మధ్యలో తెలుపు చుక్కల డ్రెస్ లో మరింత అందంగా కనిపిస్తోంది. సరిగ్గా కారు ఎక్కుతోన్న సమయంలో తీసిన ఫోటోలు ఇవి.  ప్రస్తుతం ఈ ఫోటో లు  ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. అభిమానులు కామెంట్లతో హీటెక్కిస్తున్నారు.  తెలివైన `ఎత్తు`లతో చిత్తు చేస్తున్న జిత్తులమారి! అంటూ కొందరు యూత్ ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు.