Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కుర్రాళ్ల క‌ళ్ల‌లో శిలువ వేసేసిన దిశా

By:  Tupaki Desk   |   13 Jun 2021 4:30 AM GMT
ఫోటో స్టోరి: కుర్రాళ్ల క‌ళ్ల‌లో శిలువ వేసేసిన దిశా
X
లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ అన్ లిమిటెడ్ ఇన్ స్టా ట్రీట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిరంత‌రం జిమ్ యోగా సెష‌న్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోల‌ని షేర్ చేస్తున్న దిశా ఇటీవ‌ల‌ మాల్దీవుల విహారం నుంచి వ‌రుస బికినీ ఫోటోల‌ను షేర్ చేయ‌గా వెబ్ లో దుమారం రేపాయి.

దిశాలో ర‌క‌ర‌కాల కోణాల్ని ఈ ఫోటోషూట్లు ఆవిష్క‌రిస్తున్నాయి. తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోలో దిశా ఒక కేఫ్ లో కూర్చుని తన ఫోన్ లో బిజీగా ఉంది. త‌న అంద‌మైన ముఖార‌విందం ఆ కొవ్వొత్తి కాంతిలో ధ‌గ‌ధ‌గా మెరుస్తోంది. వీట‌న్నిటికీ మించి దిశా మెడ‌లోని ఆ శిలువ పెండెంట్ ప్ర‌త్యేకంగా హైలైట్ అయ్యింది. బ్లాక్ డ్రెస్ లో ఇన్న‌ర్ అందాల్ని కూడా ఎలివేట్ చేసింది ఈ ఫోటోగ్రాఫ్.

ఈ ఫోటోలో దిశా దేవ‌తా సుంద‌రిని త‌ల‌పిస్తోందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.కుర్రాళ్ల క‌ళ్ల‌లో శిలువ వేసేసిన దిశా అంటూ కొంద‌రు పొగిడేశారు. దిశా సోదరి ఖుష్బూ పటాని కూడా ఈ ఫోటోను చూశాక‌.. క్యూట్ అని ప్ర‌శంసించింది. స‌ల్మాన్ - దిశా జంట‌గా న‌టించిన రాధే ఇటీవ‌లే రిలీజై డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో దిశా కొంత నిరాశ‌కు గురైంది. కానీ త‌దుప‌రి ప‌లు భారీ చిత్రాల్లో దిశా క‌నిపించ‌నుంది.