Begin typing your search above and press return to search.

బాల‌య్య‌-బోయ‌పాటి మూవీ లో దిశ ఎపిసోడ్

By:  Tupaki Desk   |   7 Dec 2019 4:26 AM GMT
బాల‌య్య‌-బోయ‌పాటి మూవీ లో దిశ ఎపిసోడ్
X
న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌-బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ మూవీ NBK 106 ఈ శుక్ర‌వారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. సింహా- లెజెండ్ త‌ర్వాత‌ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి ఈ కాంబో సెట్స్ పైకి వెళుతోంది. బాల‌య్య‌కు హ్యాట్రిక్ ఇవ్వ‌డ‌మే ధ్యేయంగా బోయ‌పాటి మాంచి మాస్ మ‌సాలా యాక్ష‌న్ క‌థాంశాన్ని రెడీ చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న‌ రూల‌ర్ చిత్రీక‌ర‌ణ ముగించి బోయ‌పాటితో షూటింగ్ ను శ‌ర‌ వేగంగా పూర్తిచేయాల‌ని బాల‌య్య‌ భావిస్తున్నార‌ట‌.

ఇక ఎన్బీకే 106 కోసం బోయ‌పాటి ఎలాంటి క‌థాంశాన్ని ఎంచుకున్నారు? అంటే.. ఈసారి స్క్రిప్టు సామాజిక న్యాయం.. ఎమోష‌న్ .. ఎంట‌ర్ టైన్ మెంట్ అంశాలు పుష్క‌లంగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌. ఇక బాల‌య్య క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉంటుంది? అంటే.. మ‌రోసారి ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ లో క‌నిపించ‌నున్నార‌ని ఆవేశ ప‌రుడైన జెంటిల్మ‌న్ గా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఇక బోయ‌పాటి గ‌త సినిమాల్లో మ‌హిళ‌ల ఔన్న‌త్యానికి పెద్ద పీట వేశారు. బోయ‌పాటి స‌క్సెస్ పాయింట్ కూడా అదే. అలాంటి అంశం ఈ సినిమాలో కూడా కామ‌న్ గా ఉంటుంద‌ట‌. అంతేకాదు మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యంపైనా అభిమానుల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా సంచల‌నం సృష్టించిన దిశ ఘ‌ట‌న‌ను బోయ‌పాటి త‌న సినిమాలో చూపిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం దేశంలోనే ట్రెండింగ్ లో నిలించిన అంశం కాబ‌ట్టి ఇలాంటి పాయింట్ తీసుకుంటే సినిమాకు మైలేజ్ పెరుగుతుంద‌ని భావిస్తున్నార‌ట‌.

సింహా - లెజెండ్ సినిమాల్లో బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల కు థియేట‌ర్ల‌ లో అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. సింహా చిత్రం లో వ‌రంగ‌ల్లు స‌హా దేశ‌ వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన యాసిడ్ దాడుల ఎపిసోడ్స్ ని చూపించి మెప్పు పొందారు. ఆ స‌న్నివేశాల‌ను బోయ‌పాటి ప‌వ‌ర్ ఫుల్ గా త‌న‌దైన శైలిలో ఎలివేట్ చేసాడు. ఇక లెజెండ్ లో అమ్మాయిల‌ను పురిటిలోనే చంపేసే నీచాన్ని హైలైట్ చేసే స‌న్నివేశం ఒక‌టుంటుంది. ఆ రెండు సెన్సిటివ్ పాయింట్స్ ను తన క‌థ‌లో ప‌ర్ పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసాడు. అందుకే ఇప్పుడు దిశ ఘ‌ట‌న‌ను ఎన్బీకే 106లోకి డ్రాగ్ చేస్తున్నార‌ట‌. హైద‌రాబాద్ లో దిశ‌ హ‌త్యాచార నిందితుల దుర్మార్గాన్ని.. అనంత‌రం జ‌రిగిన ఎపిసోడ్స్ .. ఎన్ కౌంట‌ర్ ప్ర‌తిదీ బాల‌య్య సినిమాలో చూపించ‌బోతున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.