పూల్ లో హొయలు పోతున్న లోఫర్ బ్యూటీ

Sun Dec 04 2022 12:03:14 GMT+0530 (India Standard Time)

Disha Patani Teases With Poses In Swimming Pool

లోఫర్ సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. హీరోయిన్ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. సినిమాలతో మాత్రమే కాకుండా ఇలాంటి ఫోటో షూట్స్ తో ముద్దుగుమ్మ దిశా పటానీ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుంది.దిశా పటానీ హీరోయిన్ గా తెలుగు లో చేసింది ఒక్క సినిమానే అయినా కూడా ఫోటో షూట్స్ కారణంగా మంచి పాపులారిటీని ఇక్కడ కూడా దక్కించుకుంది. మళ్లీ దిశా తెలుగు లో నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉంటారు.

ప్రస్తుతానికి ఈ అమ్మడికి తెలుగు లో నటించే ఆసక్తి లేదని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో తేలిపోయింది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫొటోకు జనాలు ఫిదా అవుతున్నారు. స్విమ్మింగ్ పూల్ లో హొయలు పోతూ ఫొటోలకు ఫోజ్ ఇచ్చిన ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో హొయలతో ఈ అమ్మడు హీట్ పుట్టిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఈ చలికాలంలో కూడా ఈ అమ్మడు చన్నిటి స్థానంను స్విమ్మింగ్ పూల్ లో చేయడం ద్వారా హీట్ పెంచుతుంది అంటూ సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది.

హీరోయిన్ గా ఈ అమ్మడు ఇదే స్థాయిలో అందాలను ఆరబోస్తూ నటించడం వల్ల తక్కువ సినిమాలకే ఈ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. బికినీ ట్రీట్ ఇచ్చిన ముద్దుగుమ్మ దిశా పటానీ ఈ ఫొటో తో అలరిస్తుందని చెప్పాలి.