దిశా పటాని సర్జరీ తేడా కొట్టేసిందా?!

Sat Nov 27 2021 17:00:01 GMT+0530 (IST)

Disha Patani surgery make a difference

దిశా పటానీని చూడగానే నెమలి పిల్లనా? హంసపిల్లనా? అనే డౌటు వస్తుంది. ఒళ్లంతా వయ్యారాలే .. సొగసుల జలపాతాలే అనిపిస్తుంది. కుర్రాళ్లందరి కంటికి ఆమె చిక్కిపోయిన చందమామలా .. ఉపవాసాలు చేసిన ఊర్వశిలా అనిపిస్తూ ఉంటుంది.పూల చెండుకంటే కూడా బరువు తక్కువగా .. పలచగా చేసిన పాలకోవాలా కనిపించే ఈ పిల్లకు అభిమాని కాని కుర్రాళ్లు ఎవరైనా ఉన్నారంటే వాళ్లు ఈ గ్రహానికి సంబంధించిన వాళ్లు కాదని చెప్పేయవచ్చు. అంతగా ఆమె తన నాజూకైన సౌందర్యంతో పిలగాళ్ల గుండె గదుల్లో స్థానం సంపాదించుకుంది.

మెరికల్లాంటి అబ్బాయిలను .. మెరుపుతీగల్లాంటి అమ్మాయిలను తెరకి పరిచేయం చేసే పూరి జగన్నాథ్ ఈ బ్యూటీని పట్టు కొచ్చాడు. 'లోఫర్' సినిమాతోనే దిశా పటాని కెరియర్ మొదలైంది. తేనెటీగ లాంటి ఈ అమ్మాయిని చూసి వయసులో ఉన్నవాళ్లంతా ఒళ్లు మరిచిపోయారు.

తెలుగు తెరకి ఇలియానాలాంటి పిల్ల దొరికిందని సంబరపడిపోయారు. తెలుగు తెరపై ఇక ఈ పిల్ల జోరు కొనసాగడం ఖాయమని చెప్పుకున్నారు. కానీ ఆ తరువాత ఈ భామను బాలీవుడ్ వదిలిపెడితేనేగా తెలుగు సినిమా చేసేది.

హీరోలకి కండలు తగ్గకూడదు .. హీరోయిన్లు కండపట్టకూడదు అని బాలీవుడ్ ఆడియన్స్ అనుకుంటారు. అందువలన అక్కడ ఏ హీరో పక్కన చూసినా జీరో సైజు హీరోయిన్నే కనిపిస్తుంది. అందువలన కాస్త బొద్దుగా ఉన్నవాళ్లు కష్టపడి మరీ కసరత్తులు చేస్తుంటారు.

వాళ్లు సన్నబడేవరకూ ఆగలేని వారు దిశాపటానిని తీసేసుకున్నారు. అలా వరుస అవకాశాలతో ఆమె తన దూకుడును కొనసాగిస్తూ వెళుతోంది. అయితే రీసెంట్ గా 'అంతిమ్' స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరైన దిశా పటానీని చూసిన నెటిజన్లు ఆమె లుక్ తేడాగా ఉన్నట్టుగా గమనించారు. తన ముక్కుకు .. పెదాలకు ఆమె సర్జరీ చేయించుకున్నట్టుగా భావిస్తున్నారు.

'సర్జరీతో ముఖాన్ని పాడు చేసుకున్న మరో హీరోయిన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతకు ముందు అందంగా ఉన్న ఆమె ముఖం ఇప్పుడు అలా లేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొంతమంది హీరోయిన్లకు సర్జరీ తేడా కొట్టేసిందనీ దిశా విషయంలోను అదే జరిగిందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తన అభిమానులకు .. ఆరాధకులకు ఇంతగా అసహనం కలగడానికి కారణమైన సర్జరీని దిశా చేయించుకుందా? లేదా? అనేది ఆమెనే చెప్పాలి.

అప్పటివరకూ అభిమానులు చేస్తున్న ఈ ఉద్యమాన్ని అలా చూస్తుండటమే!