సినిమారంగంలో దిశా.. కదనరంగంలో ఖుష్బూ!

Sat Apr 20 2019 19:48:48 GMT+0530 (IST)

Disha Patani sister Kushboo Patani as jawaan

దిశా పతాని గురించి అసలు సినీ ప్రేమికులకు పరిచయం చేయనవసరమే లేదు.  తెలుగులో 'లోఫర్' సినిమాలో నటించిన ఈ భామకు ఇక్కడ విజయం దక్కలేదు కానీ బాలీవుడ్ సముద్రంలో మాత్రం లంగర్ వేసి మంచి రికగ్నిషన్ సాధించింది. హిట్స్ సాధించడమే కాదు.. కాల్విన్ క్లెయిన్ లో దుస్తుల ఫోటో షూట్లతో ఇంటర్నెట్ లో చిన్నపాటి సునామీని తెప్పించింది.  ప్రస్తుతం దిశా చేతిలో క్రేజీ బాలీవుడ్ ఆఫర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా దిశా తన సోదరి గురించి సోదరి ప్రొఫెషన్ గురించి వెల్లడించి అందరినీ సర్ ప్రైజ్ చేసింది.దిశా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన సోదరి ఫోటో పోస్ట్ చేసి.. ఆమె గురించి కొన్ని వివరాలు వెల్లడించింది.  తన సోదరి పేరు ఖుష్బూ పతాని అని.. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా పనిచేస్తోందని తెలిపింది. అంతే కాకుండా తన సోదరికున్న డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువేనంది. బాలీవుడ్ హీరోలు హీరోయిన్లలో ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన వారు చాలామందే ఉన్నారు.  అక్షయ్ కుమార్ నాన్నగారు ఆర్మీ ఆఫీసర్. ఇక హీరోయిన్లలో ప్రీతీ జింటా.. ప్రియాంక చోప్రా.. అనుష్క శర్మ లాంటి వారు ఆర్మీ ఫ్యామిలీల నుండి వచ్చినవారే.  అయితే దిశా విషయంలో మాత్రం పేరెంట్స్ కాకుండా తన సోదరి ఆర్మీ ఆఫీసర్.  ఏదేమైనా ఇద్దరు సోదరీమణులు విభిన్నరంగాలు ఎంచుకోవడం.. అందులో విజయం సాధించడం గొప్ప విషయమే కదా.  దిశా పతాని ఎప్పుడైతే తన సోదరి ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో.. ఆమే ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.  

ఇక దిశా ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే సల్మాన్ ఖాన్ 'భారత్' లో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.  ఈ సినిమా జూన్ 5 రిలీజ్ అవుతోంది. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మలంగ్' లో కూడా దిశా హీరోయిన్.  ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 న రిలీజ్ అవుతోంది.