Begin typing your search above and press return to search.

టూపీస్ లో దిశ ప‌టానీ అగ్గి రాజేసిందే

By:  Tupaki Desk   |   25 Sep 2021 3:30 PM GMT
టూపీస్ లో దిశ ప‌టానీ అగ్గి రాజేసిందే
X
`లోఫ‌ర్` చిత్రంతో పరిచ‌య‌మైన దిశా ప‌టానీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. టాలీవుడ్ లో న‌టించింది ఈ ఒక్క చిత్ర‌మే. కానీ అమ్మ‌డిని ఇక్క‌డ స్టార్ హీరోయిన్ ని మాత్రం చేయ‌లేక‌పోయింది. అటుపై దిశ బాలీవుడ్ కి వెళ్లిపోయి అక్క‌డే స్థిర‌పడింది. అక్క‌డ కెరీర్ బాగానే సాగుతోంది. అగ్ర హీరోల చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. ప్ర‌స్తుతం `ఏక్ విల‌న్ రిట‌ర్న్స్`..`టీనా` చిత్రాల్లో న‌టిస్తోంది. ప్రోఫెష‌నల్ గా అమ్మ‌డి కెరీర్ అలా సంతోషంగానే సాగిపోతుంది. ఇక బాలీవుడ్ లో దిశ స్నేహితుల జాబితా కూడా చాలా పెద్ద‌దే. అగ్ర హీరోయిన్లంద‌రితోనూ మంచి రిలేష‌న్ మెయింటెన్ చేస్తుంది. అమ్మ‌డు మంచి డాన్స‌ర్ కూడా అవ్వ‌డంతో బాలీవుడ్ లో క‌లిసొచ్చింది.

ఇక ఇన్ స్టాలో దిశ పటానీ దుమారం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు టెంప్టింగ్ ఫోటోలో మ‌తులు చెడ‌గొడుతుంది. రిసార్ట్స్..బీచ్ ఒడ్డున దిగిన హాట్ ఫోటోల్ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసి అంద‌ర్నీ ఫాలోర్స్ ని ఖుషీ చేస్తుంది. ఇటీవ‌ల అమ్మ‌డు ప్రింటెడ్ టెడ్ స్కేట‌ర్ దుస్తుల్లో తడిపొడి అందాల్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది. తాజాగా మ‌రోసారి ఏకంగా టూపీస్ ల్లోనే చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగింది. లైట్ గులాబీ టూపీస్ లో ఎర్ర‌టి ఎండ‌లో అమ్మ‌డు కైపెక్కిస్తోంది. అప్పుడే స‌ముద్రంలోకి ఈత కొట్ట‌డానికి దిగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మోకాళ్లు లోతు ఉప్పునీటిలోకి దిగి అమ్మ‌డు హోయ‌లు పోయిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటోంది. మాల్దీవులు వెకేష‌న్లో భాగంగానే ఇలాంటి చిలౌట్ మూవ్ మెంట్స్ ని షేర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి బాలీవుడ్ బ్యూటీల‌కు మాల్దీవులు బెస్ట్ వేకెష‌న్ స్పాట్ గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఒక్క రోజు స‌మ‌యం దొరికినా భామా మ‌ణులు మాల్దీవులు ప్లైట్ ఎక్కిపోతున్నారు. రోజంతా అక్క‌డ ఎంజాయ్ చేసి మ‌ర‌లా రాత్రి తిరుగు ప్ర‌యాణం అవుతున్నారు.