నిలువెత్తు పింక్ పారిజాతం దర్శన భాగ్యం

Thu Jul 07 2022 10:07:47 GMT+0530 (IST)

Disha Patani Saree Photo Talk

దేవతా సుందరికి మరో రూపాన్ని.. నిలువెత్తు పింక్ పారిజాతాన్ని చూడాలని ఉందా? అయితే ఇక్కడికి రండి.  సోషల్ మీడియాల్లో నిరంతర చకోరపక్షుల్లా సంచరించేవారికి ఇలాంటివి కొత్త కాదు కానీ.. కచ్ఛితంగా ఈ పింక్ పారిజాతకాన్ని యూనిక్ కోణంలో చూసేవారికి ఇది స్పెషల్ ట్రీట్ అనాల్సిందే. అబ్బబ్బ.. అంతగా మైమరిపించేస్తోందా?  అంటే దానికి టీఆర్పీ మీరే ఇవ్వాలి సుమీ!సీకే బ్యూటీగా చెలరేగినా.. బికినీ బీచ్ గాడెస్ గా కుర్రహృదయాల్ని దోచుకున్నా దిశా పటానీ తర్వాతే. దేశంలోనే మోస్ట్ వాంటెడ్ ఫిట్టెస్ట్ బ్యూటీగా దిశాకు వందకు వంద మార్కులేసింది నేటియువతరం. తనని స్ఫూర్తిగా తీసుకుని జిమ్ యోగా అంటూ శ్రమించేవారికి కొదవేమీ లేదు. ఆవిరులు పుట్టించే దేహశిరుల వెనక కథలెన్నిటినో దిశా ఇప్పటికే సోషల్ మీడియాల్లో రివీల్ చేస్తోంది.

తాజాగా దిశా పటాని మరో హాట్ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేయగా అది దుమారం రేపుతోంది.  దిశా లేటెస్ట్ ఫ్యాషన్ గేమ్ అమితంగా ఆకర్షించింది. తాజా ఫోటోషూట్ లో దిశా పింక్ మిరుమిట్ల చీరలో తళుక్కుమంది. వైట్ క్రిస్టలైన్ డిజైనర్ టాప్ ని ధరించిన దిశా పాక్షికంగా అందాల్ని ఎలివేట్ చేసే పింక్ క్రిస్టలైన్ డిజైనర్ చీరతో హంగుల్ని అద్భుతంగా జోడించింది. ఈ పారదర్శక చీరలో దిశా అందచందాలన్నీ అలా బయటపడుతున్నాయి. చీరలో దిశా టోన్డ్ ఫిజిక్ సోయగం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో దుమారంగా మారాయి.

స్పోర్ట్స్ బయోపిక్ M.S తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుండి. దిశాకు ఎదురే లేదు. బాలీవుడ్ అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. బాఘీ 2 లో అద్భుతమైన గెటప్.. నృత్య కదలికలతో మతులు చెదరగొట్టింది. ఇటు తెలుగులోనూ లోఫర్ చిత్రంతో అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత సౌత్ పై ఆసక్తిని కనబరచలేదు. ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది.

దిశా తదుపరి మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఏక్ విలన్ 2 లో కనిపించనుంది. ఇందులో జాన్ అబ్రహం- ఆదిత్య రాయ్ కపూర్- అర్జున్ కపూర్ - తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూలై 8న విడుదల కానుంది. 29 ఏళ్ల  దిశా కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉంది. తదుపరి ధర్మ ప్రొడక్షన్స్ లో సిద్ధార్థ్ మల్హోత్రా - రాశి ఖన్నా లతో కలిసి భారీ యాక్షన్-డ్రామా చిత్రం 'యోధా'లో కనిపించనుంది. ఈ చిత్రం 2022 నవంబర్ 11న థియేటర్లలోకి రానుంది.

లోఫర్ తర్వాత చాలా కాలానికి.. సౌత్ లో ఒక సినిమాకి సంతకం చేసింది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ప్రాజెక్ట్ కె'లో కూడా కనిపించనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్- దీపికా పదుకొణె వంటి టాప్ స్టార్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.