Begin typing your search above and press return to search.

దేహాన్ని తీగ‌లా చుట్టేసిన డ్రెస్ లో ప‌టానీ

By:  Tupaki Desk   |   3 Dec 2021 1:30 PM GMT
దేహాన్ని తీగ‌లా చుట్టేసిన డ్రెస్ లో ప‌టానీ
X
`లోఫ‌ర్` బ్యూటీ దిశా ప‌టానీ ప‌బ్లిక్ అప్పియ‌రెన్స్ అన్నివేళ‌లా హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాష‌న్స్ అండ్ ట్రెండ్స్ ని అనుకరించ‌డంలో దిశా ఏమాత్రం త‌గ్గ‌దు. ఇటీవ‌ల మాల్దీవుల విహారం నుంచి దిశాప‌టానీ బికినీ షో వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు త‌డ‌ప్ ప్రీమియ‌ర్ షోలో దిశా వ‌న్నె చిన్నెల వ‌య్యారం కుర్రాళ్ల కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌లేదంటే న‌మ్మండి.

బుధవారం ముంబైలో `తడప్` ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన దిశా పటానీ హాటెస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. సునీల్ శెట్టి కుమారుడు అహ‌న్ శెట్టి - తారా సుతారియా జంట‌గా న‌టించిన త‌డ‌ప్ ప్రీమియ‌ర్ కి ఈ బ్యూటీ హాజ‌రైంది. అహ‌న్ డెబ్యూ సినిమా కావ‌డంతో బాలీవుడ్ ప్రముఖులు తమ ప్రేమ ను మద్దతును చూపించారు. ఇక ఈ ప్రీమియ‌ర్ లో దిశా లుక్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారింది.

స్టార్-స్టడెడ్ ప్రీమియ‌ర్ కోసం టాన్ డ్రెస్ ని ఎంచుకుంది. అద్భుతమైన ఫిగర్ ను చాటుకుంది. దిశా ప్రదర్శన అభిమానుల అంచనాలను మించిపోయింది. దిశా వొంపుసొంపుల వయ్యారాల్ని..బాడీకాన్ డ్రెస్ లో ఆవిష్క‌రించిన తీరు మంత్ర‌ముగ్ధం చేసింది. తన అందమైన శరీరాకృతిని ప్రదర్శించడానికి దిశా ఎప్పుడూ మొహ‌మాటం చూపించదు. తాజాగా ఈ ప్రదర్శన అందుకు మినహాయింపు కాదు. స్పఘెట్టి స్ట్రాప్ డిజైన్ తో ఆమె లేత గోధుమరంగు దుస్తులలో ఈవెంట్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ప్రముఖ పాపారాజీ వైరల్ భయానీ ఈవెంట్ నుండి ఆమె వీడియోను పోస్ట్ చేశారు. క్ష‌ణాల్లో అది వైర‌ల్ అయ్యింది. దీనిపై టైగ‌ర్ ష్రాఫ్ - కృష్ణా ష్రాఫ్ స‌హా ప‌లువురు స్పందించారు.

సునీల్ శెట్టి వార‌సుడు అహ‌న్ `తడప్` చిత్రంతో అరంగేట్రం చేశాడు. సల్మాన్ ఖాన్ - ఆయుష్ శర్మ- అనుపమ్ ఖేర్- సంజయ్ కపూర్- KL రాహుల్ - హార్దిక్ పాండ్యా- కాజోల్- భూషణ్ కుమార్ - రితీష్ దేశ్ ముఖ్ ప్రీమియర్ లో అహన్ - తారలకు మద్దతుగా ప్ర‌చారానికి ముందుకు వచ్చారు. నేడు (డిసెంబర్ 3న) ఈ సినిమా విడుదలైంది.