నిక్కరు నారాయణమ్మలా సీకే బ్యూటీ ఫికరేందండీ?

Sat Oct 17 2020 10:15:17 GMT+0530 (IST)

Do you like CK Beauty like in Shorts?

దిశా పటాని అంటే ఫిట్నెస్.. ఫిట్ లుక్ అంటే దిశా పటానీ. ఆ రెంటినీ విడదీసి చూడలేం. వారాంతంలో అభిమానుల కోసం ‘ఫిట్ స్పిరేషన్’ ను బయటకు తీస్తుంటుంది. ఎందుకంటే తన టోన్డ్ మిడ్ రిఫ్ ను అభిమానులకు చూపించేందుకు తహతహలో భాగమే ఇదంతా. సీకే బ్రాండ్ లోదుస్తులతో కుర్రకారుకు వలలు వేయడంలో అనుభవం వచ్చేశాక.. ఇప్పుడు ఇంకా కొత్తగా ట్రై చేస్తోంది ఈ అమ్మడు.బాలీవుడ్‌లో అత్యుత్తమ ఫిట్ బాడీ ఉన్న నటీమణులలో దిషా పటాని ఒకరు. సోషల్ మీడియాలో జరంత స్పీడ్ గా ఉండే బ్యూటీ. అభిమానులను అలరించడానికి నిరంతరం అద్భుతమైన ఫోటోల్ని.. వ్యాయామ వీడియోలని షేర్ చేస్తుంటుంది. ఇటీవల హెవీవెయిట్ ట్రైనింగ్ వీడియో నుండి బటర్ ఫ్లై కిక్ వరకు.. ఆమె ప్రతి వీడియో అభిమానులకు ప్రేరణ. ఈ పంథాని కొనసాగిస్తూ.. దిషా ఈసారి ఒక ప్రధానమైన పోస్ట్ ను మిర్రర్ సెల్ఫీతో పంచుకుంది. ఫిట్ నెస్ లో గోల్ రీచ్ అయ్యిందట.

ఈ ఫోటోలో దిశా టోన్డ్ మిడ్ రిఫ్ ను ప్రదర్శించింది. అద్దం ముందు నిలుచుని సెల్ఫీ తిసి మరీ వైరల్ చేస్తోంది. అయితే ఈ ఫోటో చూడగానే దిశా ఏంటి ఇలా నిక్కరు నారాయణమ్మలా దర్శనమిచ్చింది? అంటూ తెలుగు కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ సంగతి చూస్తే.. దిషా ఇటీవలే సల్మాన్ ఖాన్ ` రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` షూటింగ్ లో పాల్గొంటోంది. లోనావాలాలో ఒక పాట చిత్రీకరించిన తరువాత షూటింగ్ ను ముగించారు. దిశా తన బృందంతో పాటు ఒక అద్భుతమైన చిత్రాన్ని పంచుకుంది “# ప్యాక్ అప్ అత్యుత్తమమైన # గర్ల్‌పవర్`` అంటూ కొటేషన్ ని ఇచ్చింది ఆ ఫోటోకి. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రణదీప్ హూడా... జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించారు.