దిశా పటానీ కిర్రాక్ లుక్..కైపెక్కిస్తుందే!

Mon Jul 04 2022 06:00:01 GMT+0530 (IST)

Disha Patani Latest Photo

ఎదుటివారిలో నీకు నచ్చే రంగు ఏది? అంటే `నలుపు` అని ఠకీమని చెప్పేయొచ్చు. బ్లాక్ ప్రభావం అలాంటిది. ఎవరినైనా ఓ రేంజులో ఎలివేట్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి సైతం ఎదుటివారు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే చాలా చాలా ఇష్టం. ఇదిగో ఇక్కడ లోఫర్ బ్యూటీని చూశాక టీనేజీ గాళ్స్ వార్డ్ రోబ్ కలెక్షన్స్ లో నలుపు రంగుకే అత్యంత ప్రాధాన్యతనివ్వడం ఖాయం.అందాల దిశాపటానీ  ఫ్యాషన్ ప్రపంచంలో ఎదురేలేకుండా దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భామ ఎక్కడ ఉన్నా - అక్కడ ఫ్యాషనిస్టాలు ఆగి చూడాల్సిందే. ఇదివరకెన్నడూ ఇలాంటి ఫ్యాషన్ చూడలేదంటూ ఆ కొత్తదనానికి మురిసిపోవాల్సిందే. నిరంతరం ఏదో ఒక ఫోటోషూట్తో సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు టచ్ లో ఉంటూనే ఉంది.

కాబట్టి దిశా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఎప్పటికప్పుడు వేడెక్కించే ఫోటోల్ని ఇన్ స్టాగ్రమ్ లో అప్ లోడ్ చేస్తూ హడావుడి చేస్తుంటుంది. తాజాగా అమ్మడు మరోసారి బ్లాంక్ అండ్ బ్యాక్ లో కుర్రకారులో అగ్గిరాజేసే ఫోటోతో ముందుకొచ్చేసింది. నలుపు రంగు బ్లౌజ్ లో ఎద అందాలు ఎంతగా హైలైట్ అవుతున్నాయో? బాటమ్  ప్లోరల్ లో అదే తీరున ఆకట్టుకుంటుంది. అమ్మడి లో టోన్డ్ అందంతో అంతే హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఈఫోటో నెట్టింట వైరల్ గా మారింది. యువత హాట్ కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు.

ఇక అమ్మడి కెరీర్ విషయానికి వస్తే `లోఫర్` తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిన సంగతి తెలిసిందే. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుని దూసుకుపోతుంది. `వెల్కమ్ టూ న్యాయార్క్` ..`భాగీ-2`.. `రాధే` లాంటి చిత్రాలు అమ్మడి రేంజ్ ని పెంచాయి. ప్రస్తుతం `ఎక్ విలన్ రిటర్న్స్`..`యోధ`..`టీనా` చిత్రాల్లో నటిస్తోంది.

అలాగే పాన్ ఇండియా చిత్రం `ప్రాజెక్ట్ -కె` లోనూ ఇటీవల ఛాన్స్ దక్కించుకుని  వెలిగిపోతుంది. `లోఫర్` తర్వాత వచ్చిన తెలుగు సినిమా అవకాశం కావడం తో ఎలాగైనా సద్వినియోగం చేసుకుని సక్సెస్ తో ఇక్కడా చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తోంది. తెలుగు సినిమా స్థాయి పెరగడంతో బాలీవుడ్ నవ నాయికలు  టాలీవుడ్ పై ఏకాగ్రత చూపడం చూస్తునే ఉన్నాం. మరి దిశ పటానీ కంబ్యాక్ తో ఎలా రాణిస్తుందో చూడాలి.