ఫోటో స్టొరీ: మళ్ళీ విరుచుకుపడిన దిశా తుఫాను

Wed Jun 19 2019 23:00:02 GMT+0530 (IST)

ఒక జమానాలో హేమ మాలినిని 'డ్రీమ్ గర్ల్' అనే వారు.  ఆ తర్వాత కొంతమంది సుందరాంగులు ఇలాంటి బిరుదులు తెచ్చుకున్నారు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి సంగతి తెలిసిందే.  ఆవిడకు అతితెలివైన వర్మ నుంచి అందమైన మహేష్ బాబు దాకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.  ఇక ఈ జెనరేషన్ లో కూడా ఎంతో మంది బ్యూటీలు ఉన్నారు.  లస్ట్ భామ కియారా.. క్యూట్ బ్యూటీ అలియాలకు భారీ ఫాలోయింగే ఉంది.  కానీ వీరందరిలో దిశా పటాని స్పెషల్.ఈ పాప ఒక్కసారి కనుక ఇన్నర్ వేర్ వేసిందంటే చాలు.. ఇంటర్నెట్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ షేక్ అవుతుంది.  ఇప్పటికే ఇన్నర్ వేర్ అంటే కాల్విన్ క్లెయిన్ మాత్రమే అన్నట్టు పాపులర్ చేసిన ఈ  బ్యూటీ తాజాగా మరోసారి అంతః సౌందర్యాన్ని ప్రదర్శించింది.  ఒక మోడరన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇన్నర్ వేర్ లో ఖజురహో శిల్పంలా నిలబడింది.  ఇలాంటి పోజుల కోసమే ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా ఉండేలా కసరత్తులు చేస్తూ ఉంటుంది.  ఈ కాలంలో కాళిదాసు లాంటి కవులు లేరు.. ఒకవేళ అలాంటి కళాపోషణ ఉన్నా .. కావ్యాలు రచించరు. ఈ ఫాస్ట్ జెనరేషన్ కు తగ్గట్టు కత్తిలాంటి కామెంట్లు పెట్టి సరిపెట్టుకుంటారు.

అందుకే  ఈ ఫోటోను పోస్ట్ చేసిన గంటల్లోపే 8 లక్షల లైకులు ఎనిమిది వేల కామెంట్లు పెట్టారు. "ఇది ఒక హోలీ బికినీ".. "ఖూబ్ సూరత్ కాలి జెహెర్".. "అందరూ కాల్విన్ కొనుక్కునేవరకూ ఊరుకోవా?".. "ఎవరైనా ఫైర్ డిపార్ట్ మెంట్ కు ఫోన్ చెయ్యండ్రా" అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం ఈ హాటు షో తట్టుకోలేక "ఫ్యాషన్ కు కూడా ఒక హద్దు ఉంటుంది" అంటూ చిర్రుబుర్రులాడారు.