పటానీ దెబ్బకి తీరానికి చేరిన షిప్పులు!

Sat Nov 27 2021 20:00:01 GMT+0530 (IST)

Disha Patani Flaunts Her Beauty on the Beach

`లోఫర్` చిత్రంతో పరిచయమైన దిశా పటానీ ఆ తర్వాత తెలుగు పరిశ్రమ వైపు చూసిందే లేదు. టాలీవుడ్ లో చేసింది ఈ ఒక్క చిత్రమే అయినా ఇక్కడ పాపులారిటీ తక్కువేమీ కాదు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రమే నటిస్తోంది. అక్కడ కెరీర్ బాగానే సాగుతోంది. అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.ప్రస్తుతం `ఏక్ విలన్ రిటర్న్స్`..`టీనా` చిత్రాల్లో నటిస్తోంది. ప్రోఫెషనల్ గా అమ్మడి కెరీర్ అలా సంతోషంగానే సాగిపోతుంది. ఇక బాలీవుడ్ లో దిశ స్నేహితుల జాబితా కూడా చాలా పెద్దదే. అగ్ర హీరోయిన్లందరితోనూ మంచి రిలేషన్ మెయింటెన్ చేస్తుంది. దిశా మంచి డాన్సర్ కావడం బాలీవుడ్ లో కలిసొచ్చింది.

ఇక ఇన్ స్టాలో దిశ పటానీ దుమారం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోటోషూట్లతో మతులు చెడగొడుతుంది. రిసార్ట్స్ పరిసరాల్లో బీచ్ సైడ్ హాట్ ఫోటోషూట్లతో ఇన్ స్టా వేదికగా షేర్ చేసి ఫాలోర్స్ ని పెంచుకుంటోంది. తాజాగా ప్రింటెడ్ టెడ్ స్కేటర్ దుస్తుల్లో తడిపొడి అందాల్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది.

తాజాగా మరోసారి ఏకంగా టూపీస్ లో చెలరేగింది. రెడ్ కలర్ టూపీస్ లో మండే ఎండలో టోన్డ్ స్కిన్ తో కెమారాకి ఫోజులిచ్చింది. సముద్రంలో షిప్పులు అయినా పటానీని చూసి దిశను మార్చుకోవాల్సిందే.

ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. మాల్దీవులు వెకేషన్లో భాగంగానే ఇలాంటి చిలౌట్ మూవ్ మెంట్స్ ని షేర్ చేసింది దిశా. కరోనా మొదలైన దగ్గర నుంచి బాలీవుడ్ భామలకు మాల్దీవులు బెస్ట్ వేకెషన్ స్పాట్ గా మారిపోయిన సంగతి తెలిసిందే.

ఒక్క రోజు సమయం దొరికినా భామా మణులు మాల్దీవులు ప్లైట్ ఎక్కిపోతున్నారు. రోజంతా అక్కడ ఎంజాయ్ చేసి మరలా రాత్రి తిరుగు ప్రయాణం అవుతున్నారు. సారా అలీఖాన్ - జాన్వీ కపూర్ య- పూజా హెగ్డే తర్వాత దిశా ట్రీట్ ఓ రేంజులో ఉంది.