బికినీ బీచ్ లో సీకే బ్యూటీ విరహజ్వాల

Wed Oct 27 2021 17:00:01 GMT+0530 (IST)

Disha Patani Flaunts Her Beauty on the Beach

బికినీ బీచ్ సెలబ్రేషన్స్ స్పెషలిస్టుగా.. సీకే బ్యూటీ అంబాసిడర్ గా యువతరం గుండెల్లో నిలిచిపోయింది దిశా పటానీ. అంతకుముందే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. `లోఫర్` చిత్రంతో పెద్దతెరకు పరిచయమైన ఈ ముంబై బ్యూటీ టాలీవుడ్ లో నటించింది ఒక్క చిత్రమే అయినా గ్లామర్ డాళ్ గా అసాధారణ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక్కడ స్టార్ హీరోయిన్ కాలేకపోయినా ఫాలోయింగ్ కి కొదవేమీ లేదు. దిశా తిరిగి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వస్తోంది అన్న ప్రచారమే కానీ అది ఎందుకనో కుదరడం లేదు.మరోవైపు ఇన్ స్టాలో దిశా పటానీ దుమారం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోటోషూట్లతో మతులు చెడగొడుతుంది. సీకే బ్రాండ్ ప్రమోషన్స్ అనంతరం రకరకాల బ్రాండ్లకు ప్రచారకర్తగా అదరగొట్టింది. బికినీలు స్విమ్ సూట్లతో ట్రీట్ కి కొదవే లేదు. బీచ్ ఇసుకల్లో దిశా స్పెషల్ ట్రీట్ కి సంబంధించిన ఫోటోలకు నెట్ లో కొదవేమీ లేదు. ఇప్పుడు మరోసారి గూగుల్ ని షేక్ చేసే బీచ్ ఫోటోలతో దిశా విరుచుకుపడింది. ఇదిగో ఇలా తనలోని విరహాగ్నిని బీచ్ వాటర్స్ లో చల్లారుస్తోంది.

నురుగులు కక్కుతున్న సముద్రుడు కెరటాల రూపంలో దిశాలోని వేడిని తగ్గించే ప్రయత్నం చేస్తుంటే అది చూపరుల కంటికి ఇంపుగా ఉంది. దిశా తనలోని విరహాగ్నిని తాళలేని పరిస్థితి కనిపిస్తోందంటూ కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ భంగిమలో దిశా ఒంపుసొంపులు వయ్యారాల వడ్డన హీటెక్కిస్తోంది. బీచ్ పరిసరాల్లోని ఈ ఫోటోషూట్ ని దిశా ఇన్ స్టా వేదికగా షేర్ చేసి ఫాలోవర్స్ ని ఖుషీ చేస్తోంది. తన బీచ్ వెకేషన్ నుండి అద్భుతమైన ఫోటోని పంచుకోవడం ద్వారా ఇంటర్నెట్ ను భగభగలాడించింది. దిశా పటానీ మాల్దీవుల పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. దిశా కొన్ని నెలల క్రితం తన ప్రియుడు.. నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి బీచ్ విహారానికి విచ్చేసింది. మళ్లీ ఇప్పుడు కూడా దిగిపోయిందిలా. దిశా పటానీ పోస్ట్ లోని వ్యాఖ్యల విభాగంలో.. అభిమానులు రెడ్ హార్ట్- ఫైర్ ఈమోజీలను షేర్ చేస్తున్నారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం `ఏక్ విలన్ రిటర్న్స్`..`టీనా` చిత్రాల్లో నటిస్తోంది. కెరీర్ అలా జోష్ తోనే సాగిపోతుంది. ఇక బాలీవుడ్ లో దిశ స్నేహితుల జాబితా కూడా చాలా పెద్దదే. అగ్ర హీరోయిన్లందరితోనూ మంచి సత్సంబంధాల్ని కలిగి ఉన్న ఈ బ్యూటీకి అవకాశాలకు కొదవేమీ లేదు.