దిశా 29వ బర్త్ డే .. టైగర్ కానుకేమిటో కానీ!

Mon Jun 14 2021 13:00:02 GMT+0530 (IST)

Disha 29th Birthday ..Tiger shroff gift

`లోఫర్` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దిశా పటానీ ఆ తర్వాత పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైంది. హిందీలో వరుసగా సల్మాన్ భాయ్ సరసన భారత్ .. రాధే వంటి ఫ్లాపుల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇక తన స్నేహితుడు టైగర్ నటించే ప్రతిష్ఠాత్మక `భాఘి` ఫ్రాంఛైజీలోనూ దిశా పటానీ ఒక భాగం. ఎప్పటికీ తన ఫేవరెట్ స్టార్ టైగర్ ష్రాఫ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ జంట చాలా కాలంగా విడిపోయాం! అంటూనే కలిసి షికార్లు చేయడం ఎప్పుడూ అభిమానులకు ఫజిల్ లాంటిది. ఈ ఫజిల్ వీడేదెపుడు విప్పేదెవరు? అన్నది అటుంచితే దిశా మాత్రం టైగర్ ఫ్యామిలీలో ఒక భాగం అని  ప్రూవైంది. బహుశా టైగర్ కి దిశా కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ ఉండరు. అంతగా ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు మింగిల్ అయిపోయారు. 2021 జనవరిలో మాల్దీవుల విహారానికి వెళ్లింది ఈ జంట.

కలిసి షికార్లేనా కలిసి డ్యాన్స్ క్లాసులు.. కలిసి మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ కలిసే జిమ్ యోగా డిన్నర్ లు వగైరా వగైరా చాలా ఉన్నాయి. అందుకే బాలీవుడ్ లో హాట్ కపుల్ గా పాపులరయ్యారు.

నేడు దిశా 29వ పుట్టినరోజు సందర్భంగా టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్ నే ప్లాన్ చేశాడు. ఈ రోజు తన పుట్టినరోజు కేక్ మీద 29 కొవ్వొత్తులను వెలిగించేందుకు ఏర్పాట్లు చేశాడు. సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షల రూపంలో దిశా అభిమానుల నుంచి చాలా ప్రేమను పొందింది.  టైగర్ ష్రాఫ్ బి-డే బేబి కోసం ఒక ప్రత్యేక పోస్ట్ ను ఇన్ స్టాలో పంచుకున్నారు. వీరిద్దరూ కలిసి ఓ వీడియోలో సాల్సా డ్యాన్స్ చేస్తున్న క్లిప్ ని షేర్ చేశారు. భాఘి 2 నుంచి స్పెషల్ క్లిప్ ఇది.

హ్యాపీ బర్త్ డే విలన్ అంటూ టైగర్ వ్యాఖ్యను జోడించగా.. టైగర్ సోదరి కృష్ణ కూడా హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు. టైగర్ తల్లి అయేషా ష్రాఫ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి దిషా ప్రతిస్పందిస్తూ..``అబ్బా! నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఆంటీ. నువ్వు బెస్ట్`` అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అన్నట్టు దిశా 30వ పుట్టినరోజు లోపు తిరిగి టాలీవుడ్ లో ప్రవేశించేందుకు ఆస్కారం లేకపోలేదు. అల్లు అర్జున్ -చరణ్ - ప్రభాస్ లాంటి స్టార్లు ఈ అమ్మడితో ఐటమ్ నంబర్ ని ప్లాన్ చేస్తున్నారన్న గుసగుసలు ఉన్నాయి.