Begin typing your search above and press return to search.

సంక్రాంతి త‌ర్వాత బొక్క బోర్లా ప‌డ్డారు

By:  Tupaki Desk   |   19 Feb 2020 9:15 AM GMT
సంక్రాంతి త‌ర్వాత బొక్క బోర్లా ప‌డ్డారు
X
సంక్రాంతి పందెంలో `అల వైకుంఠ‌పుర‌ములో` క్లీన్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. స‌రిలేరు నీకెవ్వ‌రు చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించిన చిత్రంగా టాక్ తెచ్చుకుంది. ర‌జ‌నీ ద‌ర్బార్ ఫ‌ర్వాలేద‌నిపించింది. అయితే క‌ల్యాణ్ రామ్ న‌టించిన సినిమా `ఎంత మంచి వాడ‌వురా` మొద‌లు .. ఆ త‌ర్వాత రిలీజైన సినిమాల బాక్సాఫీస్ స‌న్నివేశ‌మేమిటి? వాస్త‌వ గ‌ణాంకాలు ఎలా ఉన్నాయి? అన్న‌ది ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిశాయి.

సంక్రాంతి తరువాత ఐదు సినిమ‌లు రిలీజ‌య్యాయి. ఎంత మంచి వాడ‌వురా- డిస్కో రాజా-అశ్వ‌థ్థామ‌- జాను- వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాలు బాక్సాఫీస్ బ‌రిలో దిగాయి. వీటిలో ఏ సినిమా సీనెంత‌? అన్న‌ది వాస్త‌వ‌ కలెక్షన్ రిపోర్టులు తాజాగా రివీల‌య్యాయి. ఇంత‌కీ ఆ ఐదు చిత్రాల విష‌యంలో తెలుగు ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంది? అంటే..

క‌ళ్యాణ్ రామ్ న‌టించిన `ఎంతా మంచివాడ‌వురా` దాదాపు 9.2 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేసి 10కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యంగా రిలీజైంది. కేవ‌లం 6.94 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. 2.26 కోట్ల వ‌ర‌కూ న‌ష్టం త‌ప్ప‌లేదు. దీంతో ఫ్లాప్ గా డిసైడ్ చేశారు. ఆ త‌ర్వాత ర‌వితేజ `డిస్కోరాజా` 19.2 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. 20 కోట్ల ల‌క్ష్యంతో రిలీజై కేవ‌లం 7.81 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. అంటే 11.39 కోట్ల మేర న‌ష్టం వ‌చ్చింది. ర‌వితేజ కెరీర్ లో మ‌రో డిజాస్ట‌ర్ గా డిక్లేర్ అయ్యింది. అలాగే నాగ‌శౌర్య న‌టించిన `అశ్వ‌థ్థామ‌` 6.70 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేయ‌గా.. 7.2 కోట్ల వ‌సూళ్ల ల‌క్ష్యంగా బ‌రిలో దిగింది. కానీ 4.88 కోట్లు మాత్ర‌మే వ‌సూలైంది. 1.67 కోట్ల మేర న‌ష్టం తప్ప‌లేదు. చివ‌రికి ఫ్లాప్ అని డిసైడ్ చేశారు. శ‌ర్వా- స‌మంత జంట‌గా న‌టించిన `జాను`కి భారీ అంచ‌నాల న‌డుమ‌ 18.52కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ సాగింది. 19.25 కోట్ల బ్రేక్ ఈవెన్ క‌లెక్ష‌న్స్ టార్గెట్ గా బ‌రిలో దిగితే కేవ‌లం 8.38 కోట్లు మాత్ర‌మే వ‌సూలైంది. 10.82 కోట్ల మేర న‌ష్టాలు త‌ప్ప‌లేదు. దీనిని డిజాస్ట‌ర్ గా డిక్లేర్ చేశారు. దేవ‌ర‌కొండ‌- వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ భారీ అంచ‌నాల న‌డుమ 30 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది. 31 కోట్ల బ్రేక్ ఈవెన్ ల‌క్ష్యంగా బ‌రిలో దిగితే కేవ‌లం 9 కోట్లు (నాలుగు రోజులు) మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఫుల్ ర‌న్ లో ఎంత వ‌సూలు చేసినా 15 కోట్ల మేర న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. డిజాస్ట‌ర్ వైపు ప‌య‌నం త‌ప్ప‌డం లేదు. జాను- డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్ని 2020 ఫ‌స్టాఫ్ డిజాస్ట‌ర్లుగా డిక్లేర్ చేశారు.