సినిమా టైటిల్స్ విషయంలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్న హీరోలు...!

Fri May 29 2020 07:00:01 GMT+0530 (IST)

New Strategy Followed Heroes With Movie Titles ...!

సినీ ఇండస్ట్రీలో ఒక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయిందంటే ఆ సినిమా వివరాలు తెలుసుకోడానికి సినీ అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎవరు.. డైరెక్టర్ ఎవరు.. ఏ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.. ఈ సినిమాకి ఏమి టైటిల్ పెట్టబోతున్నారు అంటూ ఆరాలు తీస్తుంటారు. ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడేది ఆ సినిమా టైటిల్. అందుకే టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు సినిమా వాళ్ళు. స్టార్ హీరోల సినిమాలకైతే టైటిల్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు వస్తారేమో కానీ మిగతా సినిమాలకు మాత్రం టైటిల్ చాలా కీలకం అనే చెప్పాలి. కొన్ని సినిమా టైటిల్స్ లోనే స్టోరీ ఇదని హింట్ ఇస్తుంటారు. కేవలం సినిమా టైటిల్ ఇంట్రెస్ట్ గా పెట్టి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో సినిమా టైటిల్ ఒకటి పెట్టి సినిమా ఒకటి చూపించి ప్రేక్షకులను మోసం చేస్తుంటారు కూడా.అయితే కొంతమంది మాత్రం ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మా సినిమా టైటిల్ ఇది అని ప్రకటిస్తుంటారు. మరికొందరు మాత్రం సినిమా సగభాగం షూటింగ్ అయినప్పుడో.. దాదాపు పూర్తయ్యే సమయంలోనే ప్రకటిస్తుంటారు. అయితే ఇప్పుడు హీరోలు దర్శక నిర్మాతలు సినిమా టైటిళ్ల విషయంలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే హీరో ఇన్నో సినిమా అనో.. డైరెక్టర్ ఇన్నో సినిమా అనో హ్యాష్ టాగ్ పెట్టి పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత తమ టీమ్ మెంబెర్స్ ద్వారా వారు అనుకున్న కొన్ని టైటిల్స్.. వర్కింగ్ టైటిల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. దీంతో ఆ సినిమా టైటిల్ ఎలా ఉందనే సినీ అభిమానుల అభిప్రాయాన్ని నెటిజన్స్ అభిప్రయాన్ని తెలుసుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఇదే సినిమా టైటిల్ అని సోషల్ మీడియాలో షేర్ చేసేస్తూ ఉంటారు. ఇలా సినిమా టైటిల్స్ విషయంలో వారి జడ్జిమెంట్ కరెక్టో కాదో చెక్ చేసుకుంటూ ఉంటారు.

ఈ నేపథ్యంలో వారు అనుకున్న టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చి ఫీడ్ బ్యాక్ బాగుంటే ఇదే టైటిల్ ని సినిమాకి ఫైనలైజ్ చేసి ఆఫీసియల్ గా ప్రకటించేస్తున్నారు. ఒకవేళ ఆ ప్రచారంలో ఉన్న సినిమా టైటిల్ పై నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే మాత్రం మేము ఇంకా ఎలాంటి టైటిల్ అనుకోవడం లేదని.. అది ఫేక్ న్యూస్ అని.. సినిమా స్టోరీకి తగ్గట్టు టైటిల్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తామని చెప్తుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో దాదాపు అందరూ ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారట. మనం గతంలో కొన్ని సినిమాలను తీసుకున్నా ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్న దానినే జనాల్లో క్రేజ్ రావడంతో సినిమా టైటిల్ గా అనౌన్స్ చేయడం చూసాం. అలానే చాలా మంది స్టార్ హీరోల సినిమాలకు సైతం ఇలానే టైటిల్స్ పెట్టడం మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్ గా స్టార్ట్ అవ్వబోయే ఒక సినిమాకి కూడా వర్కింగ్ టైటిల్ అని ఒక పేరు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం మీద టాలీవుడ్ హీరోలు దర్శక నిర్మాతలు ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీ వలన సినిమాని జనాల్లోకి ఈజీగా తీసుకెళ్తున్నారని చెప్పవచ్చు.