రోజుకు 150 సిగరెట్లు తాగే దర్శకుడు ఆ సినిమా తర్వాత మానేశాడట

Mon Jul 26 2021 15:45:26 GMT+0530 (IST)

Director who smokes 150 cigarettes a day

తమిళ దర్శకుడు వెట్రి మారన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నా ఇండియా మొత్తం ఆయన్ను గుర్తించే స్థాయికి ఎదిగాడు. ఆయన సినిమాలు ఓ విభిన్నమైన శైలిని కలిగి ఉంటాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఆయనతో సినిమాలంటే తమిళ సూపర్ స్టార్స్ క్యూ కట్టేందుకు కూడా సిద్దం అంటారు. అలాంటి వెట్రిమారన్ ఇటీవల తన జీవితంలోని ఆసక్తికర విషయాన్ని మీడియా ముందు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ తనకు ఉన్న చెడు అలవాటు గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు.వెట్రిమారన్ 13 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండి సిగరెట్లు తాగడం మొదలు పెట్టాడట. షూటింగ్ లో ఉన్నా.. ఏదైనా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నా కూడా రోజుకు 150 నుండి 160 సిగరెట్లు తాగుతూనే ఉండేవాడట. ఒకానొక సమయంలో ఆయన సిగరెట్ల అలవాటు పీక్స్ కు వెళ్లిందట. సిగరెట్ల ను ఆ రేంజ్ లో తాగిన వెట్రి మారన్ ఇప్పుడు పూర్తిగా మానేశాడట. తాను మానేయడానికి కారణం ఒక సినిమా అంటూ వెట్రి మారన్ చెప్పుకొచ్చాడు.

సూర్య హీరోగా నటించిన వారణం ఆయిరామ్ సినిమా అదేనండి తెలుగు లో సూర్య సన్నాఫ్ కృష్ణన్ చూసిన తర్వాత సిగరెట్లు మానేయాలని అనుకున్నాడట. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. రోజుకు 150 సిగరెట్లు తాగే వ్యక్తి ఒక్క సినిమా చూసి ఆ అలవాటును మానేశాడు అంటే ఎంత గొప్ప విషయం. గౌతమ్ వాసు దేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా అలా ఎంత మందిని మార్చి ఉంటుందో అని.. జీవితంలో ఎంతో మంది సెటిల్ అయ్యేలా చేసి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వెట్రి మారన్ 150 సిగరెట్లను తాగడం మానేశాడు అంటూ ఆ సినిమా బిగ్ అచీవ్ మెంట్ గా చెప్పుకోవచ్చు.