Begin typing your search above and press return to search.

VD ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే వార్తలపై స్పందించిన డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   20 Jan 2022 1:30 PM GMT
VD ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందనే వార్తలపై స్పందించిన డైరెక్టర్..!
X
'నిన్ను కోరి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు శివ నిర్వాణ.. 'మజిలీ' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండతో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయ్యారు. అయితే వీడీ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ గ్యాప్ లో నానితో 'టక్ జగదీష్' తెరకెక్కించారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో విజయ్ సినిమా హోల్డ్ లో పడిందని వార్తలు వచ్చాయి.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' సినిమాతో పాన్ ఇండియాను టార్గెట్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో శివ నిర్వాణతో లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీ చేయడానికి ఆసక్తి చూపించడం లేదని.. వెంటనే సుకుమార్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడని రూమర్స్ వచ్చాయి. అంతేకాదు VD ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ తో సినిమా చేయడానికి శివ రెడీ అయ్యారని చెప్పుకున్నారు.

ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా దర్శకుడు శివ నిర్వణ దృష్టికి తీసుకెళ్లాడు. దీనికి స్పందించిన శివ.. అది ఫాల్స్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ తో క్యాన్సిల్ అయ్యి వెంకటేష్ తో సినిమా చేయబోతున్నాడనేది తప్పుడు వార్త అన కొట్టి పడేసాడు మజిలీ దర్శకుడు. దీంతో విజయ్ - శివ కాంబోలో మూవీ ఉంటుందని.. వెంకీమామతో సినిమా లేదనే దానిపై స్పష్టత వచ్చేసింది. కాకపోతే అది ఎప్పుడు ఉంటుందనేదే ప్రశ్నార్థకంగా మారింది.

ఇటీవల శివ నిర్వాణ నాల్గవ సినిమా కోసం తనకు కలిసొచ్చిన ప్రేమకథనే రెడీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకుల మనసులకు బాగా దగ్గరైన 'నిన్ను కోరి' 'మజిలీ' తరహాలో మరో లవ్ స్టొరీ రాస్తున్నానని.. చాలా ఎగ్జైటింగ్ గా హ్యాపీగా ఉందని . సముద్రపు కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో.. ఈ కథ కూడా అంత ఒరిజినల్ గా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. #SN4 అనే హ్యాష్ ట్యాగ్ పెట్టడంతో తదుపరి మూవీ మరో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని అర్థం అయింది. అయితే ఇది విజయ్ దేవరకొండతో చేస్తారా లేదా అంతకంటే ముందు మరో హీరోతో తీస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.