చావుకబురుకు చల్లగానే సిద్ధం అవుతున్న చిత్రయూనిట్

Fri May 29 2020 22:00:01 GMT+0530 (IST)

Chavukaburu challaga Unit ready for shooting

టాలీవుడ్లో ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యంగ్ హీరో కార్తికేయ. ఆ ఒక్క సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా కార్తికేయ కెరీర్ కి ముందు తర్వాత అన్నట్లుగా మారింది. ఇక ఆ సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు కార్తికేయ. ఆ తరువాత వరుసగా హిప్పీ గుణ369 90ఎంఎల్ సినిమాలతో టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో ప్రేక్షకులను పలకరించాడు. హీరోగానే కాకుండా నాని హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం కార్తికేయ అవకాశాలను బాగానే క్యాచ్ చేస్తున్నాడు. తాజాగా ఊహించని విధంగా గీతా ఆర్ట్స్2 బ్యానర్లో 'చావుకబురు చల్లగా' సినిమాతో విడుదలకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా లాంచ్ అయ్యి షూటింగ్ మొదలైందో లేదో అలా కరోనా లాక్ డౌన్ వచ్చేసింది.ఇక ఈ సినిమాలో కార్తికేయకి జోడీగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో కౌశిక్ పెగళ్ళపాటి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ ముగింపు దశకి చేరుకోవడంతో షూటింగ్స్ మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ముగిసిన వెంటనే షూటింగ్ కి వేగంగా కంప్లీట్ చేసుకోవాలని భావించిన దర్శకుడు.. దీనికోసం ఈ కరోనా టైంను బాగా వినియోగించు కుంటున్నాడు. ఇక హీరో కార్తికేయ హీరోయిన్ లావణ్యల కోసం ఆన్ లైన్ వర్క్ షాపులు నిర్వహిస్తున్నాడట. వర్క్ షాపులో లావణ్య కార్తికేయ స్క్రిప్ట్ చదివి వారి పాత్రలకు సంబంధించిన సీన్స్ ను ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తుంది. శవాలను తీసుకెళ్లే అంబులెన్స్ డ్రైవరుగా బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని కార్తికేయ ట్రై చేస్తున్నాడు. చూడాలి మరి ఏం జరగనుందో..!