సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్.. పవన్ కోసం కథ!

Mon Sep 26 2022 15:00:03 GMT+0530 (India Standard Time)

Director of Son of India. The story for Pawan!

రైటర్ గా పలు కామెడీ సినిమాలకు వర్క్ చేసిన డైమండ్ రత్నబాబు  ఎక్కువగా మంచు ఫ్యామిలీ హీరోలకు వర్క్ చేసుకుంటూ వచ్చాడు. ఆ కాంపౌండ్ లో అతను ఈడోరకం ఆడోరకం అనే సినిమాకి కూడా రైటర్ గా వర్క్ చేశాడు. ఆ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మోహన్ బాబు అతనికి డైరెక్షన్ చేసే ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇక వీరి కలయికలో వచ్చిన సన్ ఆఫ్ ఇండియా సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ చేసిన హడావిడి అంతా కాదు.ఇది ఒక అద్భుత ప్రయోగం అని కూడా పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అప్పటివరకు రైటర్ గా పరవాలేదు అనిపించిన డైమండ్ రత్నబాబు ఆ సినిమా తర్వాత మాత్రం మరొక సినిమాలో అవకాశం అందుకోలేదు. దాదాపు 50 మంది ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరగాల్సి వచ్చింది.

ఇక ప్రస్తుతం సప్తగిరి బిగ్ బాస్ విన్నర్ సన్నీ లతో కలిసి ఒక మల్టీస్టారర్ కామెడీ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. అన్ స్టాపబుల్ అనే ఆ సినిమా త్వరలోనే విడుదల కానుందట. అయితే ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డైమండ్ రత్నబాబు పవన్ కళ్యాణ్ కోసం గతంలో ఒక కథ కూడా రాసుకున్నట్లుగా తెలియజేశాడు.

సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నిర్మాత బండ్ల గణేష్ తన మేకింగ్ విధానం పై చాలా నమ్మకంతో ఉన్నారు అని అయితే అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలనుకుంటున్నారు చెబుతూ ఏదైనా కథ ఉంటే చూడమని కూడా అన్నాడు.

అయితే అప్పుడే మెకానిక్ అనే టైటిల్ తో ఒక కథ చెప్పాను. ఆ కథలో హీరో రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఒక మెకానిక్ గా ఎలా సాల్వ్ చేశాడు అనే కాన్సెప్ట్ తో ఉంటుంది.  ఇక సన్ ఆఫ్ ఇండియా డిజాస్టర్ అయిన తర్వాత ఎవరు కూడా తనకు ఫోన్ చేయలేదు.

ఆఖరికి నా వాచ్ మెన్ కూడా నేను చెప్పిన మాటకు విలువ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది.. అని రత్నబాబు వివరణ ఇచ్చాడు. ఏదేమైనా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నన్ని రోజులు భుజం తడతారని ఇక డిజాస్టర్ వస్తే మాత్రం మన గాలి కూడా తగలకూడదు అని సెంటిమెంట్తో ఉంటారు అని ఈ రైటర్ వివరణ ఇచ్చాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.