Begin typing your search above and press return to search.

కొత్త రూట్ లో కొర‌టాల‌.. ఈసారి నో మెసేజ్ అట‌?!

By:  Tupaki Desk   |   18 May 2022 4:49 AM GMT
కొత్త రూట్ లో కొర‌టాల‌.. ఈసారి నో మెసేజ్ అట‌?!
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ర‌చ‌యిత‌గా సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈయ‌న `మిర్చి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో డైరెక్ట‌ర్ గా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు.

ఆ త‌ర్వాత ఈయ‌న తెర‌కెక్కించిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలు సైతం మంచి విజ‌యం సాధించాయి. కానీ, ఇటీవ‌ల ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఆచార్య‌` సినిమా మాత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది.

ఈ మూవీ అనంత‌రం కొర‌టాల యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా లెవ‌ల్ లో ఈ చిత్రం నిర్మితం కానుంది. మ‌రి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినీ స్క్రీన్ పై చూడ‌ని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంద‌ని ఇప్ప‌టికే కొర‌టాల స్ప‌ష్టం చేశారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ టాక్ మొద‌లైంది. అదేంటంటే.. కొర‌టాల ఇప్ప‌టి వ‌ర‌కు మెసేజ్ ఓరియెంట్‌ సినిమాలనే రూపొందించారు. ఆయ‌న నుంచి సినిమా వ‌స్తుందంటే ఖ‌చ్చితంగా ఏదో ఒక మెసేజ్ ఉంటుంద‌ని భావిస్తారు. కానీ, ఈసారి మాత్రం ఆయ‌న నో మెసేజ్ అంటున్నార‌ట‌. ఎన్టీఆర్ తో తీయ‌బోయే చిత్రాన్ని మెసేజ్ ఓరియెంటెడ్ కాకుండా మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందించాల‌ని భావిస్తున్నార‌ట‌.

ఇందులో భాగంగానే భారీ మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్, అద్భుతమైన డైలాగ్‌లతో స్క్రిప్ట్ ను సిద్ధం చేశార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇన్నాళ్లు మెసేజ్ ఓరియెంట్ సినిమాలు చేసిన కొర‌టాల‌.. ఇప్పుడు నిజంగానే కొత్త రూట్ లో వెళ్తున్నారా? లేదా? అన్న‌ది తెలియాలంటే మ‌రి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా, `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో ప‌ట్టాలెక్క‌బోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. అలియా భ‌ట్‌, కియారా అద్వానీ, పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్నా, జాన్వీ క‌పూర్ ఇలా ప‌లువురి హీరోయిన్ల పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, ఎవ‌రూ ఫైన‌ల్ కాలేదు.