Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్‌ : ఎన్టీఆర్ బర్త్‌ డే.. స్టార్‌ డైరెక్టర్ సందడి

By:  Tupaki Desk   |   22 May 2022 2:59 PM GMT
క్లిక్‌ క్లిక్‌ : ఎన్టీఆర్ బర్త్‌ డే.. స్టార్‌ డైరెక్టర్ సందడి
X
ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల కాస్త డల్‌ గానే పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. కాని ఈసారి మాత్రం ప్రతి చోట కూడా అంబరాన్ని తాకేలా సంబరాలు అన్నట్లుగా అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా కూడా హడావుడి చేశారు.

ఇక ఎన్టీఆర్ కు పెద్ద ఎత్తున స్టార్స్ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్‌ కూడా బర్త్‌ డే నాడు ఫుల్‌ బిజీ అన్నట్లుగా గడిపినట్లుగా తెలుస్తోంది. అంత బిజీలో స్నేహితుడు అయిన వంశీ పైడిపల్లి నిర్వహించిన బర్త్‌ డే వేడుకలో పాల్గొన్నాడు. ఆ పార్టీ లో ఎన్టీఆర్‌ దంపతులతో పాటు వంశీ పైడిపల్లి దంపతులు ఇంకా కొద్ది మంది ఆప్త మిత్రులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ మరియు వంశీ పైడిపల్లి ల కాంబోలో గతంలో సినిమా వచ్చిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కూడా ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇద్దరు కూడా సందర్భానుసారంగా కలుస్తూనే ఉంటారు. తాజాగా ఎన్టీఆర్‌ పుట్టిన రోజును వంశీ పైడిపల్లి నిర్వహించడం ద్వారా ఇద్దరి మద్య ఉన్న స్నేహం అందరికి మరింత క్లారిటీ వచ్చింది.

వంశీ ప్రస్తుతం తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఆ సినిమా హైదరాబాద్‌ మరియు పరిసర ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు తో పాటు తమిళంలో కూడా ఏక కాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఆ సినిమా రాబోతుంది.

ఇక ఎన్టీఆర్‌ విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. అతి త్వరలోనే కొరటాల శివ.. ఎన్టీఆర్‌ కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా ఈ పార్టీని చూస్తుంటే భవిష్యత్తులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరో సినిమా చేసే అవకాశాలు లేకపోలేదు అనిపిస్తుంది.