బన్నీని పైడిపల్లి లాక్ చేసినట్టేనా?

Mon Mar 01 2021 17:00:01 GMT+0530 (IST)

Director Vamsi Paidipalli Upcoming Movie Updates

సూపర్ స్టార్ మహేష్ కోసం మూడేళ్లు వేచి చూసి మహర్షి సినిమా తీశాడు వంశీ పైడిపల్లి. ఆ సినిమాతో విజయం అందుకుని ఆ తర్వాత వెంటనే మహేష్ తోనే సినిమా చేయాలనుకున్నాడు. కానీ స్క్రిప్టు పరంగా మెప్పించలేకపోవడంతో పరశురామ్ కి ఆ ఛాన్స్ వెళ్లింది. ప్రస్తుతం మహేష్ సర్కార్ వారి పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగానే.... మహేష్ తో ఆ తర్వాత పైడిపల్లి సినిమా ఉంటుందని గుసగుసలు వినిపించాయి. కానీ పైడిపల్లి తన ప్రయత్నాల్లో తాను ఉన్నాడు. చరణ్ .. బన్ని లాంటి వాళ్లకు కథలు వినిపించాడు. ఎట్టకేలకు చరణ్ తో కుదరకపోయినా బన్నీకి కథ నచ్చిందని తెలిసింది.

ఫైనల్ డ్రాప్ట్ స్క్రిప్ట్ ను బాస్ అల్లు అరవింద్ విని ఓకే చేయాల్సి ఉంటుందట. అయితే బన్ని ప్రస్తుతం పుష్ప చిత్రీకరణ పూర్తి చేసి ఆ తర్వాత యాత్ర దర్శకుడితోనూ పని చేస్తారని ప్రచారమవుతోంది. పైడిపల్లి స్క్రిప్టు ఫైనల్ అయినట్టా కాదా? అన్నది గీతా కాంపౌండ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. మహర్షి చిత్రం 2019 మేలో విడుదలైంది. అప్పటి నుంచి అతడు తదుపరి హీరో కోసం వెయిటింగ్. ప్రతిభావంతుడైన పైడిపల్లి ఈసారి స్టార్ హీరోని లాక్ చేస్తాడనే భావిద్దాం.