Begin typing your search above and press return to search.

యూ ట‌ర్న్ లో త‌రుణ్ స‌క్సెస్ ప్లానింగ్ ఎలా?

By:  Tupaki Desk   |   26 Jun 2022 6:31 AM GMT
యూ ట‌ర్న్ లో త‌రుణ్ స‌క్సెస్ ప్లానింగ్ ఎలా?
X
`పెళ్లి చూపులు` హిట్ తో టాలీవుడ్ కి ఉవ్వెత్తున దూసుకొచ్చాడు త‌రుణ్ భాస్క‌ర్. తొలి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుని విష‌యం ఉన్న ద‌ర్శ‌కుడిగా నిరూపించుకున్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డంతో సినిమాకి మంచి రీచ్ దొరికింది. ఆ వెంట‌నే అదే బ్యాన‌ర్ త‌రుణ్ కి `ఈ న‌గ‌రానికి ఏమైంది` సినిమా చేసే అవ‌కాశం క‌ల్పించింది.

కానీ ఆ సినిమా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. దీంతో ఒక్క‌సారిగా వేడి చ‌ల్లారిన‌ట్లు క‌నిపించింది. మ‌రో ఛాన్స్ క‌ష్ట‌మైంది. ఈ క్ర‌మంలోనే న‌టుడిగా టర్న్ తీసుకున్నాడు. కొన్ని సినిమాల్లో స‌పోర్టింగ్ రోల్స్ చేసాడు. కానీ అక్క‌డా ఆశించిన విధంగా కెరీర్ సాగ‌లేదు. అయితే విక్ట‌రీ వెంక‌టేష్..నాగ‌చైత‌న్య‌ స‌హా మ‌రో హీరోతో సినిమాని డైరెక్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగింది గానీ.. అదీ జ‌ర‌గ‌లేదు.

దీంతో ద‌ర్శ‌కుడిగా గ్యాప్ త‌ప్ప‌లేదు. ఇటీవ‌లే `కీడా కోలా` అనే క్రైమ్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం త‌రుణ్ ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌రుణ్ పూర్తి స్థాయిలో ద‌ర్శ‌కుడిగా బిజీ అవ్వ‌డంపైనే దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్ ల్ని సైతం డైరెక్ట్ చేయ‌డానికి న‌డుం బిగించాడు.

ఓ అగ్ర స్థాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై రౌడీయిజం ప్రధాన ఇతివృత్తంతో 90ల నాటి వరంగల్ బ్యాక్‌డ్రాప్‌తో “ఓరుగల్లు” అనే వెబ్ సిరీస్‌ను స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో ఈ సిరీస్ ని నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం. మొత్తం మూడు సీజన్‌లను రూపొందించనున్నారు. అలాగే ద‌ర్శ‌కుడు కొన్ని కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

మొత్తానికి త‌రుణ్ భాస్క‌ర్ మ‌ళ్లీ ద‌ర్శ‌కుడిగా బిజీ అవుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. న‌ట‌న‌కు గుడ్ బై చెప్పేసి ద‌ర్శ‌కుడిగా కెరీర్ లో స్థిర‌ప‌డ‌టంపైనే దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. న‌వ‌త‌రం ప‌ల్స్ కి క‌నెక్ట్ అయ్యే క‌థ‌లు రాయ‌డం లో త‌రుణ్ కి మంచి పేరుంది. కొన్ని సినిమాల‌కు రైట‌ర్ గాను ప‌నిచేసాడు.

కెరీర్ ఆరంభం షార్ట్ ఫిలింస్ నుంచి మొద‌లై ద‌ర్శ‌కుడిగా మారిన సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ యూట‌ర్నింగ్ లో త‌రుణ్ ఎంత వ‌ర‌కూ నిల‌బ‌డ‌తాడో చూడాలి. స‌క్సెస్ నే టార్గెట్ గా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతాడో కాల‌మే నిర్ణ‌యించాలి.