తేజ ఇంకా ఎప్పుడు అప్ డేట్ అవుతావు?

Wed Feb 26 2020 06:00:01 GMT+0530 (IST)

Director Teja New Movie Updates

ఒకప్పుడు లవ్ స్టోరీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు తేజ ఆ తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోయాడు. ఆయన తీసిన.. తీస్తున్న ఔట్ డేటెడ్ సినిమాలకు ప్రేక్షకులు షాక్ ఇచ్చారు. తేజ అప్ డేట్ కాకుండా సినిమాలు తీస్తే చూడలేమని ప్రేక్షకులు పలు చిత్రాలను ఫెయిల్ చేసి మరీ చెప్పారు. మద్యలో నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్ ను అందుకున్న తేజ మళ్లీ స్పీడ్ పుంజుకున్నాను అనుకుంటున్నాడు. ఆ సమయంలోనే సీత సినిమాను తీసి తీవ్రంగా నిరాశ పర్చాడు.సీత సినిమాలో కాజల్ ను తీసుకున్న తేజ ఆ సినిమాను చాలా మూస పద్దతిలో ఔట్ డేటెడ్ గా తెరకెక్కించాడు. దాంతో ప్రేక్షకులు సినిమాను తిరష్కరించారు. హీరోయిన్ కాజల్ టైం అయి పోయింది. ఆమెను ప్రస్తుతం ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఏదైనా పెద్ద సినిమా లో లేదంటే స్టార్ హీరోల సరసన అంటే ఏమో కాని చిన్న హీరోల సరసన ఆమెను పెడితే సినిమాకు మైనస్ అవ్వడం తప్ప ప్లస్ అవ్వదు అని విశ్లేషకుల వాదన.

ఆ వాదన పట్టించుకోకుండా దర్శకుడు తేజ మళ్లీ కాజల్ నే తన సినిమాకు హీరోయిన్ గా బుక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇటీవల తేజ రెండు సినిమాలను ప్రకటించాడు. అందులో ఒకటి రానాతో చేయబోతున్నాడు. రానాతో చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను ఓకే చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాజల్ ఆఫర్లు లేకున్నా కూడా భారీ పారితోషికం డిమాండ్ చేస్తుందని.. అయినా కూడా తేజ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఓకే అంటూ ఆమెను రిపీట్ చేయాలని భావిస్తున్నాడట.

నేనే రాజు నేనే మంత్రి చిత్రం లో రానాకు జోడీగా నటించి మెప్పించింది. కనుక మళ్లీ ఆమెనే రానాకు జోడీ అనుకుంటున్నాడు. కాని ఇది కరెక్ట్ నిర్ణయం కాదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కథల విషయంలోనే కాకుండా హీరోయిన్స్ విషయంలో కూడా తేజ అప్ డేట్ అవ్వాలని పలువురు కోరుకుంటున్నారు.