తేజ చెబుతున్న సీత కబుర్లు

Thu May 23 2019 07:00:02 GMT+0530 (IST)

Director Teja About SITA Movie

ఎల్లుండి విడుదల కాబోతున్న సీత దర్శకుడు తేజకు ఒకరకంగా సవాల్ లాంటిది. నేనే రాజు నేనే మంత్రితో తన కంబ్యాక్ ని సక్సెస్ ఫుల్ గా నిరూపించుకున్నా వెంకటేష్ బాలకృష్ణ సినిమాల చేతి దాకా వచ్చి జారిపోయిన నేపధ్యంలో ఓ సాలిడ్ హిట్ పడితే మరింత కాన్ఫిడెన్సు తో కొత్త సినిమాలు చేయోచ్చనే ప్లాన్ లో ఉన్నారు. టైటిల్ మొదలుకుని ట్రైలర్ దాకా అన్నింటిలోనూ హీరొయిన్ పాత్ర డామినేషన్ మరీ ఎక్కువగా కనిపించడం గురించి తేజ వివరణ ఇచ్చాడు.టాలీవుడ్ లో పురుషాధిపత్యం మీదే ఎక్కువ సినిమాలు వస్తాయని దీనికి భిన్నంగా లేడీ లీడ్ ను హై లైట్ చేసేలా ఆ కోణంలో తన సీత చాలా స్పెషల్ గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు తేజ. నేను ఇచ్చినన్ని ఫ్లాపులు ఇంకెవరు ఇవ్వలేదని బాహాటంగా ఒప్పుకున్న తేజే ప్రీ రిలీజ్ లో సైతం ఆసక్తికరమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే

నిజానికి తేజ చెప్పినట్టు తెలుగు సినిమాల్లో మేల్ డామినేషన్ నిజమే కాని మరీ బొత్తిగా ఆ యాంగిల్ లో సినిమాలు రాకుండా పోలేదు. అప్పుడెప్పుడో విజయశాంతి కర్తవ్యం మొదలుకుని మొన్నటి అనుష్క అరుంధతి దాకా వాటిలో హీరో పేరు చెప్పమంటే టక్కున గుర్తు రాదు. కాకపోతే కమర్షియల్ సూత్రాలకు కట్టుబడ్డ సౌత్ సినిమా ఎక్కువ కాలం వాటినే తీస్తూ కూర్చోలేదు.

తన సినిమాల్లో ఏదో ఒక లేడీ క్యారెక్టర్ ద్వారా స్త్రీ వాదాన్ని సమర్ధిస్తాను అంటున్న తేజ సీతకు ముందు అనుకున్న టైటిల్ సావిత్రట. ఎనిమిదేళ్ల క్రితమే రాసుకున్నా మధ్యలో నారా రోహిత్ హీరోగా ఆ పేరుతో సినిమా వచ్చేసింది. దీంతో తేజ సావిత్రిని సీతగా మార్చుకున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సీతకు అనూప్ రూబెన్స్ సంగీతం