ప్రభాస్ డైరెక్టర్ కి ఫైనల్ గా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్!

Sat Oct 01 2022 18:00:01 GMT+0530 (India Standard Time)

Director Sujeeth to Make Film With Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడున్నరేళ్ల విరామం తరువాత రీమేక్ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన 'వకీల్ సాబ్' మూవీతో పవన్ కల్యాణ్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కూడా వరుస రీమేక్ లపై కన్నేసిన పవన్ కల్యాణ్ తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'తేరీ'. తెలుగులో ఇదే మూవీని 'పోలీసోడు' పేరుతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు కూడా.విజయ్ సమంత జంటగా నటించిన ఈ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి విజయ్ మార్కెట్ ని మరింతగా పెరిగేలా చేసింది. ఇప్పటికె తెలుగులో చాలా మంది చూసిన ఈ మూవీని పవన్ కల్యాణ్ తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇద్దరి చేతులు మారిన ఈ ప్రాజెక్ట్ ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వద్దకు చేరకింది. పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ కావడంతో ఈ మూవీ రీమేక్ లో నటించడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

గత కొన్ని రోజులుగా పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ రీమేక్ వుంటుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభాస్ తో 'సాహో' వంటి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని రూపొందించిన సుజీత్ కు ఈ రీమేక్ ని తెరకెక్కించే బాధ్యతల్ని అప్పగించారు.

ఈ ప్రాజెక్ట్ కోసం గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న సుజీత్ ఫైనల్ గా ఇటీవలే పవన్ కల్యాణ్ కు ఫైనల్ స్టోరీ వినిపించారట. ఫస్ట్ సిట్టింగ్ లోనే సుజీత్ చెప్పిన స్టోరీ పవన్ ని ఇంప్రెస్ చేయడంతో ఫైనల్ గా ఓకే చెప్పేశారని తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్న ఈ మూవీని దసరా సందర్భంగా అక్టోబర్ 5న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారట. త్వరలోనే కీలక నటీనటులు పాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసి సినిమా రెగ్యులర్ షూటింగ్ ని నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్ల మూడి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ 'హరి హర వీరమల్లు' తదుపరి షెడ్యూల్ వర్క్ షాప్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్ రెండవ వారం అంటే 17 నుంచి ప్రారంభం కానుందట. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.