శివుడంటే వర్మకి కూడా టెర్రరే!

Wed Jun 29 2022 07:00:02 GMT+0530 (IST)

Director Ramgopal Varma

సంచలనాల రాంగోపాల్ వర్మ శైలి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనకి  ఎమోషన్స్ తో పనిలేదు. బంధాలుండవు ..భాంధవ్యాలుండవు. ఎవరైనా ఆయన్ని ఇష్టపడాలి తప్ప..ఆయన ఎవర్నీ ఇష్టపడడు. చివరికి ఆయనకి ఆయనంటేనే ఇష్ట ఉండదు. భార్య..తల్లి..చెల్లి..అక్క వంటి రిలేషన్ గురించి మాట్లాడితే? అనవసరమైన టాపిక్ అంటారు.వర్మకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుని ..అందులోనే జీవిస్తున్నారు. ఇది మాత్రం నిజం. నమ్మాల్సిన నిజం కూడా.  ఇక దేవుడు..దేవాలయాల గురించి వర్మలోని సైటెరికల్ కోణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన దేవుణ్ణి నమ్మరు. నమ్మిన  వాళ్లని  ఫూల్స్ అంటాడు. దేవుడ్ని కాదు నమ్మాల్సింది..నిన్ను నువ్వు నమ్మి జీవితంలో పైకి ఎదుగు అని గట్టిగా చెబుతాడు.

అలాంటి వర్మ శివుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. బ్రహ్మ.. విష్ణువు..శివుడు ముగ్గురిలో ఒకరికి అపాయింట్ మెంట్  ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు. ఆ సమయంలో మీరు ఐస్ క్రీమ్ 16 పార్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అనే ఆసక్తిర ప్రశ్న ముందుకు ఎళ్తే.. విష్ణు చాలా అవతారాలు ఎత్తారు. ఆయన ఎత్తినన్ని అవతారాలు ఎవరు ఎత్తలేదు.

ఆయనపై నాకు క్లారిటీ లేదు.  అతన్ని ఛాన్స్ గా తీసుకోను. బ్రహ్మ ని  ఎవరు దేవుడుగా పూజించరు. ఆయనకి  వీణ వినడం తప్ప ఇంకేం తెలియదు. సృష్టించడం అంతకన్నా తెలియదు. బ్రహ్మ గురించి అంత అవగాహన కూడా లేదు. కానీ శివుడ్ని మాత్రం ఇష్టపడతా. గెటప్ పరంగా..పవర్ పరంగా శివుడ్ని లైక్ చేస్తానని వర్మ చెప్పడం విశేషం.  దేవుడు గురించి వర్మ ఇంత పాజిటివ్ గా మాట్లాడటం ఇదే తొలిసారి కావొచ్చు.

ఇలాంటి ప్రశ్నలు ఇప్పటివరకూ చాలాసార్లు వర్మ ముందుకు వెళ్లాయి. కానీ అప్పుడెప్పుడు ఇలాంటి సమాధానం రాలేదు.  దేవుడు గురించి అడిగితే  వివాదాస్పదం చేయాలంటే ఆ కోణంలోనే మాట్లాడేవారు.  కానీ శివుడు విషయానికి వచ్చేసరికి స్వరం మార్చారు.

మరి శివుడు అంటే  ఎందుకంత  భయం వర్మ? అన్నది ఆయనకే తెలియాలి. శివుడు  వినాయకుడు తండ్రి.  అప్పుడు కుమారుడు  వినాయక్  నిజంగా పాలు తాగితే భక్తులు పోస్తారని అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. దానికి పశ్చాత్తాపంగా  శివుడ్ని లైక్ చేస్తునాడో ఏమో!