Begin typing your search above and press return to search.

టెన్ష‌న్లు అన్నీ జ‌క్క‌న్న‌కే వ‌దిలేసారు

By:  Tupaki Desk   |   27 Oct 2021 12:30 AM GMT
టెన్ష‌న్లు అన్నీ జ‌క్క‌న్న‌కే వ‌దిలేసారు
X
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి 2022 కానుక‌గా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. వంద‌ల కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం జ‌క్క‌న్న టీమ్ ఇప్ప‌టికే భారీ ప్లానింగ్ తో సిద్ధ‌మ‌వుతోంది. అయితే చ‌ర‌ణ్ - తార‌క్ ప్ర‌మోష‌న్స్ కోసం ప్ర‌త్యేకించి షెడ్యూల్ ని డిజైన్ చేయ‌నున్నారు. ఇక హీరోల‌కు సినిమా ప్ర‌చారం వ‌ర‌కూ బాధ్య‌త‌. ఇత‌ర‌ బాక్సాఫీస్ లెక్క‌లు.. రిట‌ర్నుల వ‌గైరా వ్య‌వ‌హారాల‌న్నీ ద‌ర్శ‌కుడిదే బాధ్య‌త‌. ఇక సినిమా జ‌యాప‌జ‌యాల విష‌యంలో కూడా ఆ హీరోల‌కు టెన్ష‌న్ లేనే లేద‌ట‌. ఆ మేర‌కు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఆ బాధ్య‌తల‌న్నీ తీసుకున్నారు.

వంద‌ల కోట్ల బ‌డ్జెట్ పెట్టిన సినిమా ఎలా ఆడుతుందోన‌ని హీరోలు ఆలోచించాల్సిన ప‌ని లేదు. సినిమా చూస్తున్నంత సేపూ ఆడియెన్ కి త‌మ పాత్ర‌లు ఎలా క‌నెక్ట‌య్యాయి? అన్న‌దే ఇప్పుడు తార‌క్- చ‌ర‌ణ్ ల‌కు టెన్ష‌న్ పెట్టే ఏకైక అంశం. బిజినెస్ ప‌రంగా త‌మ‌కు ఎలాంటి సంబంధం లేదు కాబ‌ట్టి కూల్ గా థియేట‌ర్లో ఆడియెన్ మ‌ధ్య‌లో కూర్చుని రెస్పాన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవ‌డ‌మే ముఖ్య‌మ‌ని భావిస్తున్నార‌ట‌. ఇక ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మాత్రం ద‌ర్శ‌కనిర్మాత‌ల‌కు స‌హ‌క‌రిస్తారు అంతే.

ఇప్ప‌టికే అద్భుతమైన ఫైనల్ కట్ తో సినిమా రెడీ అవుతోంద‌ని పెట్టిన పెట్టుబ‌డికి నాలుగింత‌లు తెచ్చే ద‌మ్ము సినిమాలో ఉంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌హా హీరోలు భావిస్తున్నార‌ట‌. ఆర్.ఆర్.ఆర్ 7 జనవరి 2022 విడుదలవుతున్న సంగ‌తి తెలిఇందే. 2022 సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్ర‌మిది. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో మార్మోగేలా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కి ఏర్పాట్లు సాగుతున్నాయి.