దర్శకేంద్రుడి తీరని కోరిక

Tue Jan 24 2023 11:18:06 GMT+0530 (India Standard Time)

Director Raghavendra Rao's unfulfilled wish

టాలీవుడ్ లో దర్శకదీరుడు అనే బ్రాండ్ ని సంపాదించుకున్న వ్యక్తం రాఘవేంద్రరావు. ఆయన కెరియర్ లో అన్ని రకాల జోనర్స్  లో సినిమాలు చేసారని చెప్పాలి. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళికి గురువుగా రాఘవేంద్రరావు ఉన్నారు. రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేసింది కూడా అతనే. ఇక రాఘవేంద్రరావు కెరియర్ లో కమర్షియల్ సినిమాలతో పాటు ఫిమేల్ సెంట్రిక్ కథలు అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రైమ్ ఇలా అన్ని రకాల జోనర్స్ ని టచ్ చేశారు. ఇక తన వంద సినిమాలు పూర్తయిన తర్వాత పూర్తిగా భక్తిరస చిత్రాల వైపు దృష్టి పెట్టారు.అన్నమయ్య రాఘవేంద్రరావు కెరియర్ లో మరిచిపోలేని చిత్రం. ఆద్యాత్మిక తత్వాన్ని తెరపై ఆ సినిమాలో అద్బుతంగా ఆవిష్కరించారు. కమర్షియల్ గా కూడా ఆ మూవీ సక్సెస్ అయ్యింది అంటే అది రాఘవేంద్రరావు క్రెడిట్ అని చెప్పాలి. ఇక శ్రీరామదాసు నమో వేంకటేశాయా సినిమాలు రాఘవేంద్రరావు మేకింగ్ విజన్ తో వచ్చినవే. ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన పర్యవేక్షణ బాద్యతలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాను కెరియర్ లో చేయలేకపోయాను అని బాధపడ్డ సినిమాలు కొన్ని ఉన్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అందులో గాంధీజీ బయోపిక్ ఒకటి. బ్రిటిష్ వారిపై అహింస అనే ఆయుధంతో పోరాటం చేసి భారత్ కి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. అతని కథని బ్రిటిష్ వారు హాలీవుడ్ లో తీసి హిట్ కొట్టారు. ఆ మూవీ కథ కథనం చూసినపుడు నేను ఎందుకు ఈ సినిమా చేయలేకపోయా అని బాధపడ్డాను అని రాఘవేంద్రరావు తెలిపారు.

అలాగే బాగ్ మిల్కా సింగ్ బయోపిక్ గా తెరకెక్కిన బాగ్ మిల్కా బాగ్ సినిమా చూసిన తర్వాత కూడా ఇలాంటి కథని తాను చేయలేకపోయినందుకు ఫీల్ అయ్యానని చెప్పారు.ఆ బయోపిక్ చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత అద్బుతంగా తెరకెక్కించవచ్చు అనేది తెలిసింది.

తరువాత మన గ్రామీణ ప్రాంతాలలో వాడే గూటీబిళ్ళ ఆటని చూసి బ్రిటిష్ వారు కనిపెట్టిన క్రికెట్ ని మనవాళ్ళు ఆడి ఎలా వారిపై గెలిచి చూపించారు అనే ఎలిమెంట్ తో వచ్చిన లగాన్ సినిమా కూడా తనకి అద్బుతంగా అనిపించింది అని చెప్పాలి.

అలాంటి కథని తాను తీయలేకపోయా అని బాధపడ్డానని రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. మొత్తానికి తన లైఫ్ లో అన్నిరకాల చిత్రాలు చేసిన బయోపిక్ ఇలాంటి సంస్కృతిలో భాగమైన ఎలిమెంట్స్ తో కథలని చేయలేకపోయినందుకు ఆ సినిమాలు చూసిన తర్వాత రియలైజ్ అయ్యానని రాఘవేంద్ర రావు చెప్పడంవిశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.