Begin typing your search above and press return to search.

పూరీ 'సెన్సాఫ్ హ్యూమర్'...!

By:  Tupaki Desk   |   19 Sep 2020 6:00 AM GMT
పూరీ సెన్సాఫ్ హ్యూమర్...!
X
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తన ఐడియాలజీని పోడ్ కాస్ట్ లో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'సెన్సాఫ్ హ్యూమర్' అనే టాపిక్ మీద మాట్లాడారు పూరీ. ''సెన్సాఫ్ హ్యూమర్.. ఇట్స్ యాన్ ఎబిలిటీ టు ఫైండ్‌ థింగ్స్ ఫన్నీ. మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలంటే.. మీకు కొంచెం డిటాచ్‌డ్ మైండ్ ఉండాలి. మీరు మరీ ఇగోయిస్టిక్ అయితే కుదరదు. మీ మీద మీరు జోకులేసుకునేంత కెపాసిటీ మీకు ఉండాలి. అప్పుడే మజా. సర్ధార్‌ జీ మీద మనం చాలా జోకు లు వింటుంటాం. ఇండియా లో అందరి కి సర్ధార్‌ జీ అంటే దేడ్‌ దిమాక్ అనే ఫీలింగ్. మనందరం సర్ధార్‌ జీ అంటే బుర్ర తక్కువ వాళ్ళని ఫిక్సయ్యాం.. బారాభజే గాళ్ళని నవ్వుకుంటాం. నో.. వాళ్లు చాలా చాలా ముదుర్లు. వాళ్ల మీద వాళ్లే జోక్స్ వేసుకుంటూ మనల్ని నవ్విస్తుంటారు. కాబట్టి మనం అలా అనుకుంటాం. ఎదుటి వాడిని జీనియస్‌ లాగా.. వాళ్లేమో ఫూల్స్‌ లాగా కలరింగ్‌ ఇస్తూ హోల్ కంట్రీ ని నమ్మించారు. సర్దార్జీస్ డబుల్‌ ఇస్మార్ట్'' అని పూరీ చెప్పుకొచ్చాడు.

''సెన్సాఫ్ హ్యూమర్ అనేది లీడర్‌ షిప్ క్వాలిటీ. అడుక్కునే సర్ధార్‌ ని ఎప్పుడైనా చూశారా? నెవ్వర్.. వాళ్లు ఎక్కడున్నా హాయిగా బతికేయగలరు. వారి ప్లస్ పాయింటే సెన్సాఫ్ హ్యూమర్. అందుకే జోక్స్ ప్రాక్టీస్ చేయండి. అందరినీ నవ్వించండి. మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే అందరూ మీకు అట్రాక్ట్ అవుతారు. దాని వల్ల మీ గ్రోత్ మారుతుంది. తెలియకుండానే మీరు లీడర్స్ అవుతారు. గ్రేట్‌ లీడర్స్‌ ని పరిశీలించండి. వారిలో చాలా హ్యూమర్ ఉంటుంది. సరదాగా పిట్టకథ చెబుతూ పెద్ద ఫిలాసఫీ చెప్పేస్తారు. చాలా హర్టింగ్‌ గా ఉండే విషయాలు కూడా ఫన్నీ వేలో చెప్పొచ్చు. దీనివల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది.. బ్లడ్‌ సర్క్యూలేషన్ అదుపులో ఉండి.. మెంటల్‌ అండ్‌ ఫిజికల్‌ హెల్త్ బాగుంటుంది. ఏ సబ్జెక్ట్ అయినా ఈజీగా అర్థం చేసుకుంటూపోతారు. సెన్సాఫ్ హ్యూమర్ వల్ల మీ క్రియేటివ్ థింకింగ్ పెరుగుతుంది. కష్టాల నుంచి ఈజీగా బయటపడతారు. కోపం బాధ మీ చుట్టుపక్కలకు రావు. సెన్సాఫ్ హ్యూమర్ లేని వాళ్లే ఎక్కువ ఏడుస్తారు. చొక్కాలు చింపుకుంటారు. సోషల్‌ మీడియాలో యాంగ్రీ పోస్ట్‌ లు పెడతారు. సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే తల్లిదండ్రుల తిట్లు కూడా సరదాగా అనిపిస్తాయి. పెళ్ళాం బండబూతులు తిట్టినా నవ్వుతూ ఫ్రెండ్స్‌ తో షేర్ చేసుకుంటారు. కోపంలో ఉన్న మీ బాస్‌ ని నవ్వుతూ క్షమించమని అడగండి.. మీరే అతనికి ఫేవరెట్‌ ఎంప్లాయ్‌ అయిపోతారు. నేను ఫూల్‌ ని అని ప్రొజెక్ట్ చేసుకోండి. అందరికీ మీరు లవబుల్‌ అయిపోతారు. అదే నేను జీనియస్‌ ని అని చెప్పండి.. చుట్టుపక్కల ఉన్నవారందరికీ ఎక్కడో కాలుతుంది. చేసే హెల్ప్ కూడా చేయరు. మీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే ఏ జబ్బులూ ఉండవు. హెల్తీ గా ఉంటారు. అందుకే దాన్ని డెవలప్ చేసుకోవాలి. నీలో సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే నీ జీవితమే మారిపోతుందని చెప్తాను'' అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.