అఖిల్ 5కి దర్శకుడు దొరికాడా?

Wed Sep 11 2019 10:37:01 GMT+0530 (IST)

Director Parasuram To Direct Akhil

అక్కినేని మూడో తరం రెండో వారసుడిగా పరిచయమైన అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టినా ఇంకా బోణీ కొట్టలేదు. మొదటి మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోకపోవడంతో అభిమానులు కూడా నిరాశలో ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ లో ఉన్న నాలుగు మూవీ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ట్రాక్ రికార్డు చాలా ఏళ్ళ నుంచి ఆశాజనకంగా లేకపోవడం వాళ్ళను ఇంకాస్త టెన్షన్ పెడుతోంది.అయితే విషయం లేనిదే గీతా ఆర్ట్స్ కానీ అఖిల్ కానీ ఈ స్టేజిలో రిస్క్ చేయరు కాబట్టి అంతో ఇంతో నమ్మకం పెట్టుకోవచ్చు. కాని ఇది ఈ ఏడాది విడుదలయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్యాన్స్ వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండగా అఖిల్ తన నెక్స్ట్ మూవీ దర్శకుడిని కూడా ఫిక్స్ చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. గీత గోవిందంతో ఇండస్ట్రీ హిట్ కొట్టినా ఏడాది పైగా గ్యాప్ తో ఉన్న దర్శకుడు పరశురామ్ ఇప్పుడు అఖిల్ తోనే చేయబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్.

మహేష్ బాబుకి కొరటాల శివ రికమండేషన్ తో రెండు మూడు సార్లు వివిధ మార్పులతో కథ వినిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫైనల్ గా లైన్ ఓకే కాలేదని తెలిసింది. దీంతో తొలుత అనుకున్న అఖిల్ తోనే పరశురామ్ లాక్ అవ్వొచ్చనే టాక్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. బొమ్మరిల్లు భాస్కర్ ది పూర్తయ్యాక ఉంటుందా లేక వెయిటింగ్ లో మరో దర్శకుడు అ! ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఉంటుందా అనేది క్లారిటీ రావడానికి ఇంకొంత టైం అయితే పడుతుంది