నాగచైతన్య సర్కారు వారి పాట ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Thu May 26 2022 07:00:02 GMT+0530 (IST)

Director Parasuram About Movie With Nagachaitanya

సర్కారు వారి పాట సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం నాగ చైతన్య సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సర్కారు వారి పాట సినిమా కంటే ముందే నాగ చైతన్య తో ఒక సినిమా ను పరశురామ్ చేయాల్సి ఉంది. కాని కరోనా ఇతర కారణాల వల్ల సినిమాను వాయిదా వేయడం జరిగింది. సర్కారు వారి పాట ఆఫర్ రావడంతో చైతూ ప్రాజెక్ట్ ను పరశురామ్ పక్కన పెట్టాడనే వార్తలు కూడా వచ్చాయి.నాగ చైతన్య తో ప్రాజెక్ట్ ఉందని.. అది క్యాన్సిల్ కాలేదు.. కేవలం వాయిదా పడింది అంటూ సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ సమయంలో దర్శకుడు పరశురామ్ చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే ఇప్పుడు నాగచైతన్య సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ముగించే పనిలో ఉన్నాడు. చైతూ థాంక్యూ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా విడుదల అయిన తర్వాత పరశురామ్ దర్శకత్వంలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.

పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న నాగ చైతన్య మూవీకి 'నాగేశ్వరరావు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం లో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నాగేశ్వరరావు టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. మరి ఈ టైటిల్ విషయంలో దర్శకుడు పరశురామ్ ఎలాంటి స్పందన తెలియజేస్తాడు అనే విషయమై ఆసక్తి నెలకొంది.

నాగ చైతన్య మూవీకి అక్కినేని ఫ్యాన్స్ అందరిని సంతృప్తి పర్చే విధంగా నాగేశ్వరరావు టైటిల్ పెడితే కచ్చితంగా సగం విజయం సాధించినట్లే అనేది కొందరి అభిప్రాయం. రవితేజ మూవీకి ఇటీవల రామారావు అనే టైటిల్ ను పెట్టడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. అందుకే ఈ సినిమా కు నాగేశ్వరరావు టైటిల్ పెట్టడం వల్ల ఖచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది.

నాగ చైతన్య మరియు పరశురామ్ కాంబో సినిమాకు సంబంధించిన నటీ నటులు మరియు ఇతర వివరాలను జులై తర్వాత వెళ్లడించే అవకాశం ఉంది. మరో వైపు నాగ చైతన్య అమెజాన్ కోసం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ ను చేస్తున్న విషయం తెల్సిందే.  థాంక్యూ   మరియు వెబ్ సిరీస్ ల తర్వాత ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీగా పరశురామ్ మూవీ ఉంటుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.