మారుతి.. ప్లానింగ్ తో వెళ్లినా బ్రేక్ తప్పేలా లేదు?

Sun Sep 25 2022 15:08:20 GMT+0530 (India Standard Time)

Director Maruthi Planning

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పెదనాన్న కృష్ణంరాజు చనిపోవడంతో మళ్లీ ప్రభాస్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా కష్టమే అయినప్పటికీ కూడా పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి నిర్మాతలపై భారం పడకుండా ప్రభాస్ మళ్లీ షెడ్యూల్స్ రీస్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.అయితే ఈ క్రమంలో ప్రభాస్ మారుతి సినిమాకు సంబంధించి మరొక టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది. అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడో మొదలవ్వాలి ముందస్తు హడావిడి గానే యూవీ క్రియేషన్స్ ప్రత్యేకంగా లింగంపల్లిలో ఒక ప్రత్యేకమైన బంగ్లా సెట్ కూడా వేసింది. కానీ మారుతి హఠాత్తుగా పక్క కమర్షియల్ తో డిజాస్టర్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా రివర్స్ అయ్యారు.

ఇక ఆ విషయంలో నిర్మాతలు కూడా అటు ఇటుగా ఆలోచిస్తున్నారు అనే టాక్ వచ్చినప్పటికీ ప్రభాస్ ఇచ్చిన మాట ప్రకారం మాత్రం వెనుకడుగు వేసే ఆలోచనలో లేడని కూడా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో ఆ ప్రాజెక్ట్ నవంబర్లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ అదే సమయంలో ప్రభాస్ ఆది పురుష్ సినిమా హడావిడి కూడా మొదలవుతుంది.

2023 జనవరిలో విడుదల కాబోతున్న ఆ సినిమా ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి రెండు నెలల ముందే ప్లానింగ్ తో మొదలు పెట్టక తప్పదు. దీంతో మారుతికి మరొక టెన్షన్ అయితే తప్పేలా లేదు. ఇక అప్పుడు కుదరకపోతే మాత్రం ఆదిపురుష్ విడుదల తర్వాత డైరెక్ట్ గా ఫిబ్రవరిలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయవచ్చు అని తెలుస్తోంది. ఒకవేళ షూటింగ్ మొదలైతే మాత్రం వీలైనంత తొందరగా కేవలం రెండు నెలల్లోనే ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ అన్నిటిని కూడా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఈ తరహా ప్లానింగ్ తో ప్రభాస్ ఎంత వేగంగా ముందుకు సాగుతాడో చూడాలి.