పవన్ కళ్యాణ్ రీమేక్.. రైటర్ మరో క్లారిటీ

Tue Jan 24 2023 10:25:54 GMT+0530 (India Standard Time)

Director Dasarath Clarity Pawan Remake Film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్  ప్రస్తుతం దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సిన సమయం. దీని తర్వాత సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సిత్తం అని సినిమాను కూడా సెట్స్ ఫైకి పవన్ కళ్యాణ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.తన రాజకీయ యాత్ర కోసం సిద్ధం చేసుకున్న వారాహి రథానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఈ యాత్ర చేయబోతున్నారు. ఈ యాత్ర ముగిసిన అనంతరం సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తమిళ హిట్ మూవీ తెరికి రీమిక్ అనే మాట వినిపిస్తుంది. అఫీషియల్ కి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయకపోయినా కూడా తాజాగా ఈ సినిమాకి రచయితగా పనిచేస్తున్న దర్శకుడు దశరథ్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసారు.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరికి రీమేక్ అయినా కూడా కేవలం అందులోని మెయిన్ స్లాట్ మాత్రమే తీసుకొని కంప్లీట్ గా కథనం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి అనుగుణంగా మార్చడం జరిగిందని తెలిపారు. ఈ కథనం పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే గత తేడాది పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి అందరికీ తెలిసింది. ఆ సినిమా కూడా అయ్యప్పన్ కోషియం అనే మలయాల మూవీ రీమేక్ అనే తెరకెక్కింది.

 కథలో చాలా మార్పులు చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు మార్చిన కూడా తెలుగులో అనుకుని స్థాయిలో సినిమా వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన కూడా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే హరీష్ శంకర్ కి రీమిక్స్ సినిమాని ఒరిజినల్ ఇన్ఫ్లుయెన్స్ ఏ మాత్రం లేకుండా ప్రజెంట్ చేయడం బాగా అలవాటు.

గద్దలకొండ గణేష్ సినిమా రీమేక్ అయిన కూడా ఆ ఛాయలు ఎక్కడ కూడా కనిపించవు. తమిళ్ మూవీ కంటే తెలుగులో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే గబ్బర్ సింగ్ మూవీ కూడా హిందీలో కంటే తెలుగులోనే బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది ఈ నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ అనే మాట కూడా వినిపిస్తుంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.