Begin typing your search above and press return to search.

భార్య స్నేహితురాలికి లైన్ వేసిన F3 డైరెక్టర్

By:  Tupaki Desk   |   25 May 2022 12:47 PM GMT
భార్య స్నేహితురాలికి లైన్ వేసిన F3 డైరెక్టర్
X
వరుసగా బాక్సాఫీస్ వద్ద విజయాలను అందుకుంటున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి మరొక కామెడీ సినిమాతో ఈసారి అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవడానికి రెడీ అయ్యాడు. వెంకటేష్ వరుణ్ తో మరోసారి కామెడీ మ్యాజిక్ క్రియేట్ చేసేందుకు F3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

అయితే ఈ ప్రమోషన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతున్న విధానం కూడా హైలెట్ గా మారుతోంది. ఇటీవల అతను తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా నా భార్య క్లాస్మేట్ అని అప్పట్లో తనకు తెలిసిన ఒక అమ్మాయిని కూడా రెగ్యులర్ గా చూసే వాడిని అని సరదాగా తెలియజేశాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనిల్ రావిపూడి కాలేజీ రోజుల్లోనే చాలా సరదాగా స్టేజ్ షోలతో కూడా అలరించే వాడట.

ఫ్రెండ్స్ తో కలిస్తే ఆ సరదా చాలా విభిన్నంగా ఉండేది అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. అయితే తన భార్యతో ప్రతిరోజు ఒక విషయంపై చిన్నపాటి సరదా గొడవ జరుగుతుంది అని అనిల్ తెలియజేశాడు. కాలేజ్ డేస్ లో ప్రతి రోజు నేను మరొక ఇద్దరు స్నేహితులం కలిసి నలుగురు అమ్మాయిలు ఉన్న ఒక బ్యాచ్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళం అంటూ.. అందులో ఒక అమ్మాయిని నేను ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని అన్నాడు.

ఒక విధంగా ఆమెకు సైడ్ కొట్టేవాడిని అంటూ.. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత ఆ బ్యాచ్ లోనే మరో అమ్మాయితో నాకు వివాహం జరగడం విశేషమని అనిల్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో నా భార్య అప్పుడప్పుడు కొంత దెప్పి పొడుస్తుంది అని కూడా ఈ దర్శకుడు చెప్పాడు. మొదటి ఎఫ్ 2 సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా తన రియల్ లైఫ్ లోనివి అంటూ.. ఇప్పుడు మాత్రం F3 సినిమాలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే డబ్బు ఫ్రస్ట్రేషన్ చూపించబోతున్న ట్లుగా అనిల్ తెలియజేశాడు.